సినిమాలతో రూ. 1000 కోట్ల క‌లెక్ష‌న్ కొల‌గొట్టిన టాప్‌ డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎన్నో సినిమాలు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా చాలామంది డైరెక్టర్లు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అయితే ఒక సినిమా రూ. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలి అంటే ఆ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్ని బాక్స్ ఆఫీస్ వద్ద వేలకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఏంటి? ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ జాబితాలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని నెంబర్ వన్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి ఒకడు. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈయన బాటలోని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా వస్తాడు. ఈయన దర్శకత్వంలో కేజిఎఫ్ 1, కేజిఎఫ్ 2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించాయి.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అట్లీ కూడా ఒకడు. ఈయన కూడా తాజాగా జవాన్ సినిమా ద్వారా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో అట్లీ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఇలా ముగ్గురు సౌత్ ఇండియా డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఈ జాబితాలో నిలిచారు. నితీష్ తివారి దంగల్ సినిమా ద్వారా ఈయన కూడా 1000 కోట్ల కలెక్షన్లు సాధించి ఈ జాబితాలో చేరాడు. ఇక తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ ఆనంద్ సైతం ఈ లిస్ట్‌లో చేరాడు.