అప్పుడు ఆచార్య.. ఇప్పుడు భగవంత్ కేసరి.. మొత్తానికి కాజల్ ని లేపేసారా..?

ఈ మధ్యనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలలోకి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ సినిమాలో కూడా బాలయ్యకు జోడిగా నటించబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఇప్పుడు తాజాగా భగవంత్ కేసరి సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ని లేపేసారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Bhagavanth Kesari song featuring Nandamuri Balakrishna, Kajal Aggarwal, and  Sreeleela to be shot in Ramoji Film City : Bollywood News - Bollywood  Hungama

భగవంత్ కేసరి సినిమాలో కేవలం శ్రీ లీల పాత్రకే మంచి ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పోస్టర్స్ టీజర్ సాంగ్స్ లలో ఎక్కువగా ఈమె గురించి ఎక్కువగా చూపించడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎక్కడ కూడా కాజల్ గురించి చూపించలేదు.. కేవలం శ్రీ లీల హంగామానే కనిపిస్తోందని చెప్పవచ్చు. దీంతో ఈ కాజల్ క్యారెక్టర్ ని తీసేసారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాజల్, శ్రీ లీలాకి తల్లి పాత్రలో నటిస్తోందట.అంత పెద్ద తరహా పాత్రలో కాజల్ ఎలా నటించింది అంటూ ప్రచారం జరుగుతోంది.

Kajal and Sreeleela dances to Balayya's blockbuster song

మొన్న మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ జరిగింది. డైరెక్టర్ అనిల్ రావు పూడి తో పాటు శ్రీ లీల కాజల్ అగర్వాల్ కలిసి జోరుగా డాన్స్ వేసిన వీడియో వైరల్ గా మారింది బహుశా షూటింగ్ గ్యాప్లో తను హీరోయిన్లతో అనిల్ రావిపూడి ఇలా హుషారుగా డాన్స్ వేయించారని వార్తలు కూడా వినిపించాయి. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా అయినప్పటికీ ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ నే తీసేసారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం విక్రమ్, ఖైదీ వంటి సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సినిమాని చేశారని సమాచారం. గతంలో కూడా ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ కు సంబంధించి సన్నివేశాలను కూడా ఇలాగే డిలీట్ చేయడం జరిగింది.