త్రివిక్రమ్ బ్యాడ్ సెంటిమెంట్‌కి నెక్స్ట్ బ‌ల‌య్యేది ఆ హీరోయినేనా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వర్క్ చేసిన హీరోయిన్స్ కెరియర్ అట‌కెక్కిందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో ఇలియానాతో ఏ రేంజ్ లో సినిమాలు చేశారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇలియానాను టాలీవుడ్ ఏ కాదు.. అటు బాలీవుడ్ కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంతతో కూడా పలు సినిమాలు చేసి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు.

అనంతరం సమంతాకు సినిమా అవకాశాలు వచ్చినా.. పెద్దగా హిట్ టాక్ అందుకోలేకపోయింది. అలాగే టాలీవుడ్ బుట్ట బొమ్మగా క్రేజీ పేరు దక్కించుకున్న పూజా హెగ్డేకు త్రివిక్రమ్ వరుస ఆఫర్లు ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మార్చాడు. ఇక ప్రస్తుతం పూజ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే.

పార్వతి మెంటన్ , ప్రణీత సుభాష్ ఇలాంటి కథానాయకులకు కూడా ఈ దర్శకుడి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి… రియల్ లైఫ్ లో లైఫ్ లేకుండా చేశాడుగా త్రివిక్రమ్ అటు ఫాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తర్వాత లిస్టులో ఉన్నది గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ అంటూ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సంయుక్త‌కి అవ‌కాశాలు ఇవంవ‌డంతో ఆమెకు కూడా కెరీర్ క్లోజ్ అయ్యిన‌ట్లే అంటూ సినీ వ‌ర్గ‌ల టాక్‌.