కొన్ని కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ లిస్ట్ లో అపరిచితుడు కూడా ఒకటి. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించగా.. చియాన్ విక్రమ్, సదా జంటగా నటించారు. తమిళంలో అన్నియన్, తెలుగులో అపరిచితుడు టైటిల్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఈ సినిమాలో మొదట విక్రమ్ నటనే గురించే చెప్పుకోవాలి. మూడు షేడ్స్ లో ఉన్న పాత్రలో విక్రమ్ చిచ్చిపాడేశాడు. అలాగే శంకర్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవల్. సినిమాలోని పాటలు, కథ, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అపరిచితుడు మూవీకి ఫస్ట్ ఛాయిస్ విక్రమ్ కాదు.
మొదట శంకర్ ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ ను తీసుకోవాలని అనుకున్నాడు. ఆయన్ను కలిసి కథ కూడా వినిపించారు. కానీ, రజనీకాంత్ నో చెప్పారు. దాంతో శంకర్ వెంటనే విక్రమ్ ను ఒప్పించాడు. అలాగే హీరోయిన్ గా మొదట ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నా.. ఆమె బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఆ తర్వాత సిమ్రాన్ ను సంప్రదిస్తే.. అప్పుడే పెళ్లి కుదరడంతో రిజెక్ట్ చేసింది. చివరిగా శంకర్ సదను ఎంపిక చేశారు. అలా విక్రమ్-సద కాంబోలో వచ్చిన అపరిచితుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏదేమైనప్పటికీ ఈ మూవీ స్టోరీ రజనీకాంత్ కు సూట్ అవ్వదు. అందుకే ఆయన రిజెక్ట్ చేసి మంచి పనే చేశారు.