సమంత, నిహారిక బాటలోనే మ‌రో టాలీవుడ్ న‌టి..!!

షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వచ్చిన ” సూర్య ” వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ భామ. తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ” బీమ్లా నాయక్ ” సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ రోల్ లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో మరింత క్రేజ్ దక్కించుకుంది.

అయితే మౌనిక రెడ్డి ఈ ఏడాది సందీప్ రెడ్డి అనే వ్యక్తిని గోవాలో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే? సినీ సెలబ్రిటీలైన.. సమంత, నిహారిక, శ్రీజ వారి భర్తలతో విడిపోయే ముందు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం, అలాగే తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకోబోతున్నారని క్లారిటీ ఇస్తున్నట్లు అర్థమైంది.


ఈ క్రమంలోనే మౌనిక రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లోని వారిద్దరి పెళ్లి ఫోటోలు.. డిలీట్ చేయడంతో ఈ రూమర్ పుట్టుకు వచ్చింది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజ‌న్లు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకోవడం.. సంవత్సరంలోపే విడాకులకు రెడీ అయిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు వివాహ బంధం పై గౌరవమే ఉండడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.