బాల‌య్య నిప్పుర‌వ్వ మ‌ళ్ళీ రెడ్డీ.. కానీ ఈ సారి నిజ జీవితం..!

నిజ జీవిత గాధలను సినిమాలుగా తీయడంలో బాలీవుడ్ ఎప్పుడు ముందడుగు వేస్తుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత పరిస్థితిలో నేపథ్యంలో కాస్త స్లో అయింది కానీ ఈ రెండేళ్ల కాలంలో చాలా జీవిత కథలు తెర‌కెక్క‌యి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ విజయాలతో కళ‌కళ‌లాడుతుంది. ఈ క్రమంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన‌ సినిమాలు పెరుగుతున్నాయి. అలా నిప్పు రవ్వ సినిమా కూడా బాలీవుడ్ లో తెరకేక్క‌నుంది.

ఏంటి బాలకృష్ణ నిప్పు రవ్వ నా..? అనుకుంటున్నారా. అవునండి అయితే అందులోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మాత్రమే నిప్పురవ్వ సినిమా తీసుకున్నారు. ఇప్పటి తరం వారికి ఈ మూవీ తెలియకపోవచ్చు.. కానీ ఒకప్పుడు భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో అది ఒకటి. బాలయ్య కెరీర్ లోనే భారీ అంచనాలతో వచ్చి దారుణమైన పరాజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో ఒక్క సీన్‌ మాత్రం హీరోయిన్గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. అదే బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించే సన్నివేశం. ఆ సన్నివేశం నిజ జీవిత ఘటన స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించారు.

ఇదే నిజ జీవిత సంఘటనను బాలీవుడ్ లో ఇప్పుడు మరో సినిమాగా తరికెక్కించారు. అంతేకాదు ఆ సినిమా రిలీజ్ కూడా రెడీ అయింది. ఇటీవల ఓఎంజి2 భారీ హీట్ అందుకున్న అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. సురేష్ దేశాయి దర్శకత్వంలో మిషన్ రాణిగంజ్ పేరుతో ఈ సినిమా తర్కెక్కుతోంది. బొగ్గు గనుల రెస్క్యు ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ మూవీ టీమ్‌ ఇటీవల రిలీజ్ చేసింది. 1989లో రాణిగంజ్ బొగ్గు గనుల్లో మైనింగ్ వర్క్‌ జరుగుతుండగా ఒక్కసారిగా లోపలకు నీళ్లు వచ్చేసాయి.

మైనింగ్ ఇంజనీర్ అయినా జస్వంత్‌ సింగ్ గిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అమర్ జోషి తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరి కార్మికులను కాపాడిన విధానం ఈ సినిమాలో కనిపించబోతుంది. రాణిగంజ్ బొగ్గు గని ప్రమాద సమయంలో 250 మంది కార్మికులు రాత్రి వీధిలో ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే 149 మంది బయటకు రాగా మరో 64 మంది మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ కథలో 6 గురు చనిపోయారు ఒక వ్యక్తి దాదాపు 36 గంటల తర్వాత ఈదుకుంటూ బయటకు రావడం విశేషం.