సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. .. మాయాలోకం ఎప్పుడు ఏదైనా జరగొచ్చు కచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం జరగదు.. ఇలాంటి డైలాగ్స్ మనం ఇప్పటికే ఎన్నో విని ఉంటాం. చాలా వరకు జరిగాయి . అలా ఇండస్ట్రీలో జరిగే మాయలకు బలైపోయిన స్టార్ నటి నటులు ఎంతమందో ఉన్నారు. ఆ లిస్టులోకే వస్తాడు మల్టీ టాలెంటెడ్ పర్సన్ శివాజీ . హీరోగా – క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా – కమెడియన్గా – రాజకీయ నాయకుడిగా తనలోని విభిన్నమైన యాంగిల్స్ని బయటపెట్టిన శివాజీ .. ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్లోకి వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్గా వెళ్ళాడు.
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శివాజీ.. కొన్ని సినిమాల్లో నటించి 2016 లో వచ్చిన సీసా మూవీ తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిట్టించుకున్నాడు.. తిట్టాడు .. మేటర్ ఏదైనా కానీ శివాజీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి క్రమంలోనే కాంట్రివర్షల్ షో అయిన బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి .. మరింత కాంట్రవర్షియల్ గా మారిపోయారు శివాజీ .
హౌస్ లోకి అడుగుపెట్టిన మొదలు ఆయన చేస్తున్న నానాహంగామ.. రచ్చరంబోలా మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. కచ్చితంగా టైటిల్ విన్నర్ అయితే అవ్వడు అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఈ శివాజీకి తెలుగు హీరో నితిన్ కి ఉన్న సంబంధం గురించి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరికి ఎటువంటి బంధం లేదు.. అంతకన్నా బ్లడ్ రిలేషన్ కూడా లేదు కానీ వీళ్ళ మధ్య మాత్రం సినిమా బంధం ఉంది . నిజానికి నితిన్ డెబ్యూ మూవీ జయం కి డబ్బింగ్ చెప్పింది శివాజీనే. దిల్ మూవీ కూడా డబ్బింగ్ చెప్పింది శివాజీనే.. దిల్ మూవీ కి గాని ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ నంది అవార్డును కూడా అందుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!