బేబి హీరోయిన్ వైష్ణ‌వి పెళ్ళి.. వ‌రుడు ఎవ‌రంటే..?

చిన్న సినిమాగా తరికెక్కిన బేబీ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో ఈ తరం యువత ఏ విధంగా ప్రేమ పేరుతో మోసపోతున్నారు..? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో..? కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు సాయి రాజేష్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

రూ.50 కోట్లకు పైగా ఈ సినిమాకు లాభాలు వచ్చాయి. హీరోయిన్ వైష్ణవి నటనకు ఏకంగా సినీ ప్రముఖులందరూ ఆమెను ప్రశంసించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోల ప్రశంసలు అందుకున్న వైష్ణవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే బేబీ సినిమాల్లో వైష్ణవి చివరకు పెళ్లి చేసుకున్న కృష్ణ మల్లిడి ఎవరో తెలుసా.. బింబిసారా దర్శకుడు వశిష్ట బ్రదర్‌అట.

అంతేకాదు యాంకర్ విష్ణుప్రియకు కృష్ణ దూరపు బంధువు కూడా అవుతాడట. ఈ న్యూస్ చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక ఈ నటుడు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. కలర్ ఫోటో సినిమాలో కూడా హీరోకు సీనియర్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.