నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ ….ఈ క్రేజీ కాంబో ఎప్పుడంటే!!

మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళి మొదలయింది సినిమా పరిశ్రమలో. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్లు కలిసి నటించేవారు. ఇప్పుడు మళ్ళి అదే ట్రెండ్ రిపీట్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఈ ట్రెండ్ కు పునాది వేశారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత విక్రమ్, తాజాగా జైలర్ చిత్రాలు కూడా మల్టీ స్టారర్ చిత్రాలుగా మంచి విజయాలనుంసాధించాయి. ఇక ఇప్పుడు ఇది ఒక సక్సెస్ ఫార్ములా గా మారిపోయింది. కొన్ని సినిమాలలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుంటే మరి కొన్ని సినిమాలలో ఒక స్టార్ హీరో పక్కన మరో 2 టైర్ హీరో ను తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో కింగ్ నాగార్జున తన నెక్స్ట్ సినిమాలో అల్లరి నరేష్ తో కలిసి నటించబోతున్నారని సమాచారం.

తన కామెడీ టైమింగ్ తో తెలుగు సినిమా పరిరమలో బెస్ట్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఐతే ఇప్పుడు నరేష్ కొంత కాలంగా తన కామెడీ యాంగిల్ ని పక్కన పెట్టి కాస్త సీరియస్ కారక్టర్లపై దృష్టి పెడుతున్నాడు. మహేష్ బాబు తో కలిసి మహర్షి సినిమాలో అల్లరి నరేష్ చేసిన పాత్రకు మంచి స్పందన లభించింది. ఆ తరువాత నరేష్ నాంది, ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం, ఉగ్రం చిత్రాలలో నటించి మెప్పించాడు. ఎప్పుడు తన కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించే నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం భావోద్వేగాలతో కూడిన పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఇప్పుడు అల్లరి నరేష్ తాజాగా కింగ్ నాగార్జున తో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. నాగార్జున హీరోగా విజయ్ బన్నీ తెరకెక్కిస్తున్న చిత్రం “నా సామిరంగా” . కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారట. దర్శకుడు నరేష్ ను సంప్రదించగానే ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. నరేష్ నాగార్జునకు వీరాభిమాని కావడంతో తాను వేరే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ సవరించుకొని ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను కూడా విడుదల చేసారు మేకర్స్.