బిగ్ బాస్ ల‌వ‌ర్స్ కు బిగ్ షాక్‌.. ఆగిపోయిన షో.. ఏం జ‌రిగిందంటే?

బిగ్ బాస్ సీజ‌న్ 7 ఇటీవ‌లె ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు సీజ‌న్స్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో.. ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సీజ‌న్ 7ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. సీజ‌న్ 7కు హోస్ట్ మార‌క‌పోయినా.. ఈసారి కేవ‌లం 14 మంది కంటెస్టెంట్సే హౌస్ లోకి ఎంట‌ర్ అయ్యారు. కొత్త కొత్త టాస్క్ లు ఇస్తున్నారు.

అలాగే కంటెస్టెంట్స్ లో చాలా వ‌ర‌కు తెలిసిన ముఖాలే ఉండ‌టంతో బిగ్ బాస్ ల‌వ‌ర్స్ షోపై మంచి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలాంటి త‌రుణంలో వారికి బిగ్ షాక్ త‌గిలింది. బిగ్ బాస్ షో ఆగిపోయింది. అయితే రెగ్యుల‌ర్ షో కాదండోయ్.. బిగ్ బాస్ 7 లైవ్ స్ట్రీమింగ్ ఆపేశారు. స్టార్ మా అనుబంధ సంస్థ హాట్ స్టార్ లో బిగ్ బాస్ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. రెగ్యూలర్ బిగ్ బాస్ షో సెన్సార్‌తో టీవీలో ప్రసారం అవుతుంది. ఇది గంటే ఉంటుంది. కానీ, హాట్ స్టార్ లో 24 గంట‌లు బిగ్ బాస్ ను చూడొచ్చు. ఎలాంటి కట్స్, బీప్స్ లేకుండా హౌస్‌లో ఏం జరుగుతుందో హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ఈ ల‌వ్ స్ట్రీమింగ్ వ‌ల్ల టీవీలో వ‌చ్చే ఎపిసోడ్ మొత్తాన్ని ముందే చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ప‌ర్మినెంట్ గా కాదు.. శ‌ని, ఆదివారాలు మాత్ర‌మే. ఈ వీకెండ్ డేస్ లో హోస్ట్‌ నాగార్జున వ‌స్తారు. కంటెస్టెంట్స్ ప్రవర్తన, పెర్ఫార్మన్స్, త‌ప్పులు, ఒప్పులు అన్ని చ‌ర్చ‌కు తెచ్చి ఎవ‌రికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తారు. అలాగే ఆదివారం ఒక‌రిని ఎలిమినేట్ చేస్తారు. లైవ్ స్ట్రీమింగ్ ఉంటే ఇవ‌న్నీ ముందే లీక్ అయిపోతాయి. అందుకే గ‌త అర్థ‌రాత్రి నుంచి లైవ్ ఆపేశారు. మ‌ళ్లీ ఆదివారం రాత్రి 10:30 గంటల నుంచి బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. కాగా, మొద‌టి వారం పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు. వీరిలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే సెకండ్ వీక్ లో మ‌రికొంత మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.