ఆ డాన్సర్ తో లవ్ ట్రాక్ న‌డుపుతున్న‌ అరియానా.. ఓపెన్ అయిన బిగ్ బాస్ బ్యూటీ (వీడియో)

బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో ” శ్రీదేవి డ్రామా కంపెనీ ” ఒకటి. ఈవారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ” మొగలిరేకులు ” సీరియల్లో పోలీస్ క్యారెక్టర్లతో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే నాయుడు ఎంట్రీ ఇస్తాడు.

అనంతరం రియల్ లైఫ్ కపుల్స్ ఒకరు తర్వాత మరొకరు వాళ్ల పార్టనర్స్ తో ఎంట్రీ ఇస్తారు. వాళ్లతో పాటు ఇమ్మానుయేల్, వర్ష కూడా వస్తారు. అయితే వాళ్ళిద్దరిది ఫస్ట్ నుంచి తెలిసిందే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సీరియల్ జోడీస్ మధ్యలో పండు, అరియానా రావడం కొంచెం ఆసక్తికరంగా ఉంది. వీళ్లద్దరు స్టేజ్ పై చూసి రష్మీ…” ఇదెప్పటి నుంచి… మీరిద్దరికీ ఎప్పుడు స్టార్ట్ అయింది ” అని అడుగుతుంది.

దీంతో పండు..” అరియానాను చూసి ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి ” అంటూ పులిహార డైలాగులు మొదలుపెట్టాడు. అరియానా కూడా ” పండు చెప్పకుండా వచ్చావ్.. చెప్పకుండా వెళ్ళిపోవ్ కదా ” అనీ అంది. దీనికి మనోళ్లు లవ్ సాంగ్ వేసుకుని సింబల్ కూడా వేస్తారు. ఇక ఏముంది బుల్లితెరపై మరో జంట రచ్చ స్టార్ట్ అయిందన్న మాట.