రష్మిక ఆఫర్ దొబ్బేసిన వైష్ణవి.. తెలుగు పిల్ల దెబ్బ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరో హీరోయిన్ చేస్తూ ఉండడం చాలా కామన్ సర్వసాధారణం అనే చెప్పాలి. ఇప్పటికే ఇండస్ట్రీలో అలా ఎంతోమంది హీరోయిన్స్ నటించారు కొందరు సక్సెస్ అయ్యారు.. మరికొందరు ఫెయిల్యూర్ అయ్యారు . అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమాలో నటించి టాప్ రేంజ్ ఆఫర్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.

ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది యూట్యూబర్ వైష్ణవి చైతన్య .. కాదుకాదు హీరోయిన్ వైష్ణవి చైతన్య.. బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య సౌందర్య బయోపిక్ లో సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . నిజానికి మేకర్స్ ముందుగా ఈ పాత్ర కోసం రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట కానీ రష్మిక మందనతో కంపేర్ చేస్తే వైష్ణవి చైతన్య ఆ లుక్స్ కి బాగా సెట్ అవుతుందని ..

తక్కువ రెమ్యూనరేషన్ తోనే మనకి సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది అని.. అభిమానులు కూడా తెలుగు అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేస్తారని .. భావించి రష్మిక మందన్నాను ఈ సినిమా నుంచి తప్పిస్తూ వైష్ణవి చైతన్యను ఫిక్స్ చేసుకున్నారట . దీంతో రష్మిక ఖాతా నుంచి సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా మిస్ అయినట్లయ్యింది..!!