యానిమల్ లో రష్మికకి ఆఫర్ ఇప్పించింది మన తెలుగు హీరోనా..? షాక్ అవుతున్న ఫ్యాన్స్..!!

అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ మూవీని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా అనిమల్ . బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ..రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . రీసెంట్ గానే రన్బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అద్భుతమైన టీజర్ రిలీజ్ చేశారు .

చాలా చాలా బోల్డ్ గా వైలెంట్ గా ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా రణ్బీర్ – రష్మిక మధ్య వచ్చిన డైలాగ్స్ చాలా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అంటున్నారు అభిమానులు . అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం చాలామందిని సెలెక్ట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగాకు స్పెషల్గా తెలుగు హీరో దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందట . రష్మిక కచ్చితంగా యాక్సెప్ట్ చేయండి అంటూ భారీ స్థాయిలో రికమెండ్ చేశారట .

ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ . రష్మిక జాన్ జిగిడి దోస్త్ కమ్ బాయ్ ఫ్రెండ్ అయినా విజయ్ దేవరకొండ ఆమెను ఈ పాత్రకు చూస్ చేసుకోమంటూ హై రికమెండ్ చేశారట . అర్జున్ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో సందీప్ రెడ్డివంగా కూడా నో చెప్పలేక ఆమెని ఈ పాత్రకు చూస్ చేసుకున్నారట . అలా అనిమల్ సినిమా లో అవకాశముందుకుంది ఈ బ్యూటీ..!!