కడపలో సొంతింటి కలను నెర‌వేర్చుకున్న కిరణ్ అబ్బవరం.. యంగ్ హీరో న్యూ హౌస్ చూశారా?

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక‌రు. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిర‌ణ్‌.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `రూల్స్ రంజన్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు.

రత్నం కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించింది. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందు రాబోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌న సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు.

సొంత ఊరు అయిన‌ కడప జిల్లా రాయచోటిలో డ్రీమ్ హౌస్ ను నిర్మించుకున్నాడు. కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం కూడా చేశాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను కిర‌ణ్ అబ్బ‌రం సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో.. ఫ్యాన్స్ మ‌రియు తోటి న‌టీన‌టులు ఆయ‌న‌కు విషెస్ తెలుపుతున్నారు. మ‌రి ఇంకెందుకు లేటు హీరోగారి న్యూ హౌస్ పై మీరు ఓ లుక్కేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)