లవంగం ఓ దివ్యఔషధం.. ఎన్ని జబ్బులకి చెక్ పెడుతుందో తెలుసా..!!

లవంగాలు మన పోపుల డబ్బాలో ఉంటాయి.. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ఏన్ని పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్, పొటాషియం, ప్రోటీన్, కొవ్వూ, ఐరన్, ఫాస్ ప్రెస్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి, క్యాలరీలు ఉంటాయి.

పరగడుపున ఒక లవంగాన్ని తింటే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. లవంగం పరగడుపున తింటే పళ్ళు, చిగుర్లు దృఢంగా ఉంటాయి.

ఇకపోతే లవంగంలో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది సైనస్ వంటి సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో సైనస్ సమస్య కూడా వస్తూ ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు లవంగం గొప్ప ఔషధం అని చెప్పొచ్చు. అలాగే బరువు తగ్గడంలోనూ లవంగం చాలా బాగా ఉపయోగపడుతుంది.