అక్కినేని అఖిల్ చేదు జ్ఞాపకాలు ఆ హీరోయిన్ మర్చిపోయిందే…..!!

ఏజెంట్ ఓ చేదు జ్ఞాపకం. ఈ సినిమాతో అనిల్ సుంకర బాగా నష్టపోయాడు. సురేందర్ రెడ్డి ఆ తర్వాత సినిమానే మొదలుపెట్లేదు. అఖిల్ పరిస్థితి కూడా ఇంతే. కానీ ఈ సినిమాతో టాలీవుడ్‌కి అడుగుపెట్టిన సాక్షి వైద్య పని మాత్రం బాగుంది. ఏజెంట్ మూవీ డిజాస్టర్ ఎఫెక్ట్ ఈ ముద్దుగుమ్మ పై అసలు పడలేదు. ఏజెంట్ చేస్తున్నప్పుడే… “గాంఢీవధారి అర్జున”సినిమాలో ఆఫర్ అందుకుంది. ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ కానుంది. ఈలోగా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో చేరాయి.

సాయి ధరంతేజ్ కొత్త సినిమాలో సాక్షి కథానాయక. ఇటీవల క్లాప్ కొట్టిన‌ ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” లో శ్రీ లీలా తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది. ఆ చాన్స్ కూడా సాక్షికే దక్కింది. దీంతో పాటు రవితేజ కొత్త సినిమాలో సాక్షిని కథానాయకగా ఎంచుకున్నారు.

అంటే మూడు సినిమాలు ఇప్పటికే ఈమె ఖాతాలో ఉన్నాయన్నమాట. గాంఢీవధారి అర్జున మూవీలో సాక్షి ది కాస్త సీరియస్ రోల్. తను ఓ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రం తనకు మంచి పాత్ర దక్కిందట. సాక్షి మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం నన్ను సంప్రదించారు. కానీ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు అని ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది.