జగన్ సెంటిమెంట్..ఎమ్మెల్యేలు తగ్గినట్లే..ముందస్తుపైనే డౌట్!

ఏ పరిస్తితులోనైనా సెంటిమెంట్ రాజేసి..ఆ పరిస్తితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జగన్ ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. వరుసగా ఆయన చేస్తున్న రాజకీయం చూస్తే అదే కనిపిస్తుంది..ఎప్పుడు ఎదోక సందర్భంగా సెంటిమెంట్ రాజేయకుండా ఉండటం కష్టం. గత ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తాను పేదల మనిషిని అని, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, తనకు ప్రజలకు అండగా ఉండాలని అంటున్నారు.

అదే సమయంలో తనపై కొంతమేర అసంతృప్తిగా ఉన్న సొంత ఎమ్మెల్యేలని సైతం సెంటిమెంట్ తోనే జగన్ పడగొడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..వరుసపెట్టి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు..సరిగా పనిచేయకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు సీటుపై డౌట్ లో ఉన్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారు.

దీంతో సీటు ఇవ్వకపోతే జంప్ అయిపోతామనే సంకేతాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పటికే తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టి‌డి‌పి నేతలు చెబుతున్నారు. దీంతో జగన్ తాజాగా జరిగిన వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు క్లాస్ ఇవ్వలేదు. చాలా సుత్తిమెత్తగా మాట్లాడారు. అందరూ ఎమ్మెల్యేలని గెలిపించుకుంటానని, మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని, కాబట్టి మనం గెలవాలని, గెలవాలంటే కొందరిని పక్కన పెట్టాలని, అలా పక్కన పెట్టిన వారికి న్యాయం చేసే బాధ్యత తనది అని ఎమ్మెల్యేలని సెంటిమెంట్ తో కొట్టారు.

దీంతో ఎమ్మెల్యేలు ఏమైనా కాస్త తగ్గుతారేమో చూడాలి. అలాగే మంత్రివర్గ విస్తరణ లేదని తేలిపోయింది..అటు ముందస్తు ఎన్నికలపై కాస్త డౌట్ గా ఉంది..ఎందుకంటే ఎన్నికలకు కరెక్టుగా ఏడాది సమయం ఉంది..కానీ ఏడాది లోపే ఎన్నికలు జరగవచ్చని జగన్ అన్నారు..అంటే అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.