SSMB -28 లో మరొక కమెడియన్.. సక్సెస్ అవుతాడా..?

టాలీవుడ్ లో కమెడియన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు నటుడు సునీల్.. పుష్ప సినిమా ద్వారా సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో విలన్ గా వరుసగా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో తమిళ మూడు సినిమాలలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా తెలుగులో పుష్ప తర్వాత చిన్న చిన్న సినిమాలలో నటించిన సునీల్ తన స్థాయికి తగ్గ పాత్రలు రాలేదని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో సునీల్ కి ఒక మంచి పాత్ర ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సునీల్ త్రివిక్రమ్ కూడా మంచి స్నేహితుల అన్న సంగతి తెలిసిందే.. సునీల్ స్టార్ కమెడియన్ గా మారడంలో త్రివిక్రమ్ పాత్ర చాలా కీలకంగా ఉన్నది.. తాను రైటర్ గా పనిచేసిన ప్రతి సినిమాలో కూడా సునీల్ కోసం మంచి రోల్స్ క్రియేట్ చేస్తూ ఉండేవారు త్రివిక్రమ్.

Trivikram-Sunil stole liquor bottles - Great Telangaana | English Trivikram- Sunil stole liquor bottles

రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో కమర్షియల్ హీరోగా పేరుపొందారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు ఇక హీరోలుగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు సునీల్. SSMB -28 చిత్రంలో నటిస్తున్న సునీల్ కు ఈ పాత్రతో మంచి సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.