ఎప్పుడు చెయ్యని ప్రయోగం చేయబోతున్న మహేష్..ఆ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తాడా..!

ఈరోజు మహేష్- త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. అయితే మహేష్ తన ప్రతి సినిమాలోను దాదాపు ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని ఆయనపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.

Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లేది  అపుడే.. |Mahesh Babu Trivikram Movie Going To Sets On July 2022 Here Are  The Details– News18 Telugu

ఈ సినిమాలో పొడవాటి జుట్టుతో మహేష్ కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉంటుందట. ఈ సినిమాలో లుక్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే రాబోయే సినిమాల్లో కూడా మహేష్ కొత్త లుక్ లో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ రూ.70 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండగా, త్రివిక్రమ్ రూ.30 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాడు.

Superstar Mahesh Babu Latest TV Ad | Mahesh Babu New Look | IndiaGlitz  Telugu - YouTube

ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఒకటైన నెట్ ప్లిక్స్ వారు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా నెట్ ప్లిక్స్ దగ్గర నుంచి దీనిపై అధికార ప్రకటన వచ్చింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.