మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చైతు-సామ్‌.. బిగ్ స్కెచ్ వేసిన అమ‌ల‌!?

నాగచైతన్య-సమంతలు విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. వారికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకప్పటి టాలీవుడ్ స్వీట్ కపుల్స్ అయిన వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అటు ఫ్యామిలీకి ఇటు వారి అభిమానులకి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారిద్దరూ విడిపోయినప్పటినుండి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా చైతు-సామ్ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో అన్నది క్లారిటీ లేదు. తాజాగా అక్కినేని అమల చైతు సమంతని మళ్ళీ కలిపే ప్రయత్నం చేయబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత నాగచైతన్య పెళ్లికి ముందు కలిసి కొన్ని సినిమాలు చేశారు. అయితే పెళ్లయిన తర్వాత `మజిలీ` అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు.

అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో `మజిలీ 2` సినిమా తీసే ప్లాన్ లో అమలా ఉన్నారట. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా అక్కినేని అమల ఉంటుందని సమాచారం. ఈ కారణంగా అయినా సమంతా నాగచైతన్యలు మళ్లీ కలిసి నటించే అవకాశం ఉందని ఇద్దరినీ కలిసి చూడొచ్చని వారి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారన్న వార్త వైరల్ గా మారడంతో అమల బిగ్ స్కెచ్ వేసిందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికీ వారి అభిమానులు వారిద్దరూ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు.

Share post:

Latest