నాగార్జున‌పై మండిప‌డుతున్న‌ సొంత అభిమానులు.. ఎంత క‌ష్టం వ‌చ్చింది?

అక్కినేని నాగార్జున.. వెండితెరపై యువ సామ్రాట్ గా. మన్మధుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. నాగార్జున అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను సందడి చేస్తున్నాడు. నాగార్జున `మీలో ఎవరు కోటీశ్వరుడు` అనే షో తో హోస్ట్‌గా బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఆ తరువాత రియాల్టీ షో `బిగ్ బాస్` కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

నాగార్జున సీజన్ 3 నుంచి ఇప్పటికే సీజన్ 6 వరకు వరుసగా హోస్టింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా అక్కినేని నాగార్జునపై తన సొంత అభిమానులే మండిపడుతున్నారు. అందుకు గల కారణం.. `బిగ్ బాస్` రియాల్టీ షో ఈసారి నాగార్జున హోస్టింగ్ కూడా పేలవంగా ఉండడంతో.. ఆయన సొంత అభిమానులే.. ఎందుకు ఇలాంటి పని చేయడం? మంచి మంచి సినిమాలు చేసి అభిమాని అలరించవచ్చు కదా.. అనవసరంగా ఒకరితో మాట పడటం ఎందుకు అని నాగార్జునని నిలదీస్తున్నారట.

నాగార్జున హోస్టింగ్ చేసిన మూడు, నాలుగు, ఐదు సీజన్ల కంటే ప్రస్తుతం సీజన్ 6 కి ఎక్కువ ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ `బిగ్ బాస్` హోస్టింగ్ చేసే టైం ఏదో సినిమాలకు కేటాయించొచ్చు కదా అని నాగార్జునకి సలహాలు ఇస్తున్నారు. ఇక సొంత అభిమానుల నుండి విమర్శలను ఎదుర్కొంటున్న నాగార్జున ఆలోచనలో పడ్డాడట. ఏదేమైనా బయట వారు విమర్శించిన పెద్ద గా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ నాగార్జున పై సొంత అభిమానులే మండిపడుతున్నారు.ఇలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.