టీడీపీలో పెరుగుతున్న సెగ‌… రాజ‌కీయం మారుతుందా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు కాకినాడ రూర‌ల్ రాజ‌కీయాలు కూడా వేడెక్కాయి. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పిల్లి అనంత‌ల‌క్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే, గ‌త ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చ‌క్రం తిప్పేది మాత్రం ఆమె భ‌ర్తే. ఇక‌.. ఆయ‌న‌తో పొస‌గని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల‌కు పిల్లి కుటుంబానికి మ‌ధ్య వివాదాలు ఉన్నాయి.

ఆయ‌న ఇక్క‌డ చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. త‌న‌కు అనుకూల‌మైన వారిని ప్రోత్స‌హి స్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు య‌న‌మ‌ల‌కు దీటైన నాయ‌కుడు ల‌భించ‌లేదు., కానీ, ఇప్పుడు రాజ‌కీయాలు మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి అత్యంత విధేయుడు, అనుచ‌రుడుగా పేరున్న కాపు నాయ‌కుడు వాసిరెడ్డి ఏసుబాబు.. త్వ‌ర‌లోనే టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే ఆయ‌న య‌న‌మ‌ల‌ను క‌లిసి.. దీనిపై చ‌ర్చించార‌ని వార్తలు గుప్పుమంటున్నాయి. య‌న‌మ‌ల కూడా.. పిల్లి కుటుంబానికి చెక్ పెట్టాల‌ని త‌న ఆధిప‌త్యం పెంచుకోవాల‌ని.. చూస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ ఏసుబాబును ఆయ‌న ప్రోత్స‌హించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌ల‌క్ష్మి కి టికెట్ ఇవ్వ‌కుండా..ఏసుబాబుకు ఇచ్చేలా చేయ‌గ‌ల స‌త్తా య‌న‌మ‌ల‌కు ఉంద‌నేది వాస్త‌వం. ఇదే జ‌రిగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ రూర‌ల్ నుంచి ఏసుబాబు పోటీ ఖాయం.

దీనివ‌ల్ల‌.. అటు వైసీపీ మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబుకు.. ఇటు టీడీపీలో త‌న‌కు ప‌డ‌ని… పిల్లి కుటుం బానికి కూడా ఒకే ద‌ఫా..చెక్ పెట్టేందుకు య‌న‌మ‌ల‌కు అవ‌కాశం చిక్క‌తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తు న్నాయి. నిజం చెప్పాలంటే.. గ‌తంలో య‌న‌మల‌కు ఉన్న జోష్ ఇటీవ‌ల కాలంలో జిల్లాపై తగ్గిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న హ‌వా పెంచుకోవాలంటే.. త‌న‌వారిని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం య‌న‌మ‌ల‌పై ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఏసుబాబుకు ఆయ‌న ప్రోత్సాహం ఉంటుంద‌ని.. ఇదే జ‌రిగితే.. టీడీపీలో మ‌రింత సెగ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.