నాగార్జున‌నే భ‌య‌పెట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైనప్పటికి.. న‌టుడిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌న్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రల‌తో సినీ ప్రియుల‌ను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్‌.. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు.

Akkineni Nagarjuna Birthday Special: From 'Zakhm' to 'Criminal' - Best Films

అటువంటి వ్య‌క్తిని ఓ హీరోయిన్ భ‌య‌పెట్టింద‌ట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అల‌నాటి తార‌, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగార్జున స‌ర‌స‌న `ఆఖరి పోరాటం` సినిమా లో శ్రీదేవి మొట్ట మొద‌టి సారి నటించింది. అయితే ఆమె అప్పటికే తండ్రి ఏఎన్నార్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయడంతోపాటు, ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

Sridevi: Nagarjuna and Sridevi in Aakhari Poratam (1988)

అలాంటి హీరోయిన్ తో తాను నటిస్తున్నాను అని తెలియగానే… నాగార్జున లోలోన తెగ భ‌య‌ప‌డిపోయార‌ట‌. ఏం చేయాలో అర్థం కాలేద‌ట‌. ఎంతో నెర్వ‌స్‌గా ఫీల్ అయ్యార‌ట‌. ఇక ఆ నెర్వ‌స్‌నెస్‌ వ‌ల్లే షూటింగ్ టైమ్‌లో శ్రీ‌దేవితో క‌లిసి న‌టించేట‌ప్పుడు ఎన్నో ఇబ్బందులను కూడా నాగ్ ఫేస్ చేశార‌ట‌. అయితే ఆ త‌ర్వాత అదే శ్రీదేవితో గోవింద గోవింద సినిమా చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, అప్ప‌టికి ఆమెతో కాస్త స‌న్నిహిత్యం ఏర్ప‌డింద‌ని నాగ్ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Share post:

Latest