శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌లు చాలా ద‌గ్గ‌రి బంధువుల‌ని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ‌హారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయ‌న 2013 అక్టోబర్ లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్రీ‌హ‌రి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి చాలా ద‌గ్గ‌రి బంధువు.

Docs bungled Srihari's case: Wife

కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌ల మ‌ధ్య బంధుత్వం ఏ విధంగా ఏర్ప‌డింది..? అసలు వీరిద్ద‌రు ఎలా బంధువులు అయ్యారు..? వంటి విష‌యాలపై ఓ లుక్కేసేయండి. సి.ఎల్. ఆనంద్ .. కన్నడ, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా, విలన్ గానూ మెప్పించిన ఈయ‌న‌కు ఇద్ద‌రు కూతుళ్లు. ఒక‌రు లలిత కుమారి కాగా.. మ‌రొక‌రు డిస్కో శాంతి.

Prakash Raj Marriage: “My Ex Wife Loves My Children Too” - The Bridal Box

వీరిలో పెద్ద అయిన లలిత కుమారిని ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నాడు. ఇక రెండో అమ్మాయి డిస్కో శాంతిని శ్రీహరి లవ్ మ్యారేజ్ చేసుకోగా.. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌హ‌రిలు తోడ‌ళ్లులు అయ్యారు. అలా వీరిద్ద‌రి మ‌ధ్య బంధుత్వం ఏర్ప‌డింది. ఇక ప్ర‌కాష్ రాజ్ ల‌లిత కుమారికి విడాకులు ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ స‌మయంలో శ్రీ‌హ‌రి.. ప్ర‌కాష్ రాజ్‌-ల‌లిత‌లు విడిపోకుండా ఉండేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. వారిద్ద‌రికీ ఎంతో న‌చ్చ‌చెప్పార‌ట‌. కానీ, శ్రీ‌హ‌రి ప్ర‌య‌త్నాలేమి ఫ‌లించ‌లేదు. ప్ర‌కాష్ రాజ్ లిలిత‌కు విడాకులిచ్చి.. పోనీ వ‌ర్మ‌ను వివాహం చేసుకున్నాడు.