హీరో కార్తికేయ లవ్ స్టోరీ..ట్విస్ట్ లు మామూలుగా లేవుగా?

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. త్వరలోనే తన బ్యాచ్లర్ లైఫ్ గుడ్ బై చెబుతూ మూడుముళ్ల బంధం తో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా కార్తికేయ తన లవ్ స్టోరీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిట్ వరంగల్ లో 2010లో తొలిసారి లోహితం కలిశానని, 2012లో ప్రపోజ్ చేశాను తెలిపాడు.

ఆమె పోస్ట్ చేసిన సంవత్సరం తర్వాత ఓకే చెప్పిందని, బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒక సారి లోహిత తనకు పంపిన మెసేజ్ కారణంగా వాళ్ల ఇంట్లో బాగా గొడవలు జరిగాయని తెలిపారు. ఆ సమయంలో ప్రాంక్ అని చెప్పి ఆ సమయంలో తప్పించుకున్న,ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యనే వాళ్ళ ఇంట్లో తెలిసింది అని చెప్పుకొచ్చాడు. వారి ప్రేమ విషయం మూడు నెలల క్రితమే కుటుంబ సభ్యులకు తెలిసిందని, మొదట తన తల్లిదండ్రులను ఒప్పించి అనంతరం ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించామని అలా మొత్తానికి మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అతను తెలిపాడు.