నీలాంబరితో సిద్ధ సరసాలు..అదిరిన `ఆచార్య‌` న్యూ పోస్ట‌ర్‌!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధ అనే కీల‌క పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రికరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండ‌గా సంద‌ర్భంగా `షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా ప్రేమ` అంటూ రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు ఉన్న ఓ న్యూ పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇక ఈ పోస్ట‌ర్‌లో నీలంబ‌రితో సిద్ధ స‌ర‌సాలు ఆడుతూ క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రంలో పూజా హెగ్డే నీలంబ‌రిలో పాత్ర‌లో కనిపించ‌నుంది.

Image

Share post:

Latest