ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో […]

జ‌గ‌న్ పోరాట పంథా మారిందా..?

రాజ‌కీయంగా ప‌వ‌న్ గండాన్ని త‌ప్పించుకునేందుకు ప్ర‌త్యేక వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్..  ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పోరులో భాగంగా విశాఖ‌లో తొలి  స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన బహిరంగ సభల్లో  మొద‌టిదైన ఈ స‌భ‌లో విప‌క్ష నేత‌ జగన్ ప్ర‌సంగించిన తీరుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇపుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. సాధార‌ణంగా జ‌గ‌న్ స‌భ  అంటేనే  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌రుష వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించ‌డం, ఇక త్వ‌ర‌లోనే తాను అధికారంలోకి […]

కాకినాడ వైకాపాలో కొత్త ర‌గ‌డ‌!

ఏపీలో పొలిటిక‌ల్‌గా సెన్సిటివ్ అయిన తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ ఇప్ప‌డు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో సెంట‌ర్ ఆఫ్‌ది పాయింట్‌గా మారింది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ మునిప‌ల్ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ఇటు టీడీపీ, అటు విప‌క్ష వైకాపాలు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వైకాపా అధినేత జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల‌పై త‌న స్కెచ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, ఆయ‌న వేసిన స్కెచ్ ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతోంది. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో స్థానిక […]

వైఎస్ఆర్ సిపి ఎంమ్మెల్సీ అభ్యర్థి బాబాయ్ యేన ?

కొద్దిరోజుల్లో జ‌ర‌గ‌నున్న‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బ‌రిలోకి వైసీపీ త‌ర‌పున తానే అభ్య‌ర్థినన్న‌ట్టుగా వైఎస్ వివేకాంనంద‌రెడ్డి ఒక‌ప‌క్క ముమ్మ‌రంగా ప్ర‌చారంలోకి సైతం దిగిపోయారు. ఈయ‌న‌ విప‌క్ష‌నేత వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న‌రెడ్డికి పిన‌తండ్రి అన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే క‌డ‌ప జిల్లాలో ఆయన ఒక్కో మండలానికీ వెళ్లి.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాట్లాడుతూ త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేలా అందరినీ కలుపుకుని వెళుతున్నారు.  జిల్లాలోని వివిధ‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుసుకుంటూ.. పార్టీ  ఓట్లను గుర్తించి, పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని సూచిస్తూ […]

ఆయ‌న‌తో ప‌వ‌న్ భేటీ సీక్రెట్ ఇదేనా..!

భ‌విష్య‌త్తు ఏపీ రాజ‌కీయాలు మంచి ర‌స‌వత్త‌రంగా ఉండ‌బోతున్నాయ‌ని చెప్పేందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అగ్ర‌న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ బ‌రిలోకి దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటూ ఉండ‌టం ఒక‌టైతే.. ఇక విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ టీడీపీకి ప్ర‌త్యామ్నాయం త‌న పార్టీయేన‌ని చాటేందుకు.. పాద‌యాత్ర‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు మ‌రో ముఖ్యాంశం. నిజానికిప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో వింత ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ప‌క్క ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో… త‌న సంక్షేమ, అభివృద్ధి ప‌థ‌కాల‌ను […]

టీడీపీలో ఒక్క‌టైన బ‌ద్ధ శ‌త్రువులు

క‌డ‌ప జిల్లాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పుట్టినిల్లుగా  జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్క‌డ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవ‌ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌..ఆదినారాయణరెడ్డి,  మొద‌టినుంచి టీడీపీనే న‌మ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల వైర‌ముంది. అందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ లోకి రావ‌డాన్ని… రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది. చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్య‌మో… లేక ఈ  జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు వ్యూహ చ‌తుర‌తో తెలియ‌దుగానీ విప‌క్ష అధినేత జగ‌న్ సొంత‌ జిల్లాలో ప‌రిణామాలు […]

కొత్త ట్విస్ట్ జ‌గ‌న్‌తో కాంగ్రెస్ దోస్తీ

ఎవ‌రు కాద‌న్నా.. అవున‌న్నా..   ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన పునాదులున్నాయి. ఈ రాష్ట్రంలో అత్య‌ధిక కాలం అధికారంలో ఉన్న చ‌రిత్ర కూడా ఆ పార్టీ పేరునే లిఖించ‌బ‌డి ఉంది.  అయితే రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆ పార్టీ ఉనికి సైతం ఏపీలో ప్ర‌శ్నార్థ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే… అయితే  కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా అప్ప‌టిదాకా బ‌లంగా ఉంటూ వ‌చ్చిన ఓటు బ్యాంకు అంతా ఏమైంది..? ఈ ప్ర‌శ్న ఎవ‌రిలోనైనా త‌లెత్తితే వెంట‌నే వారి చూపులు […]

జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌గా మారిన బావ – బావ‌మ‌రుదులు

రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప క‌ర్నూలుతోపాటు ఆ స్థాయిలో వైసీపీకి బ‌ల‌మైన జిల్లాలుగా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌ను చెప్పుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌ల కొద్దికాలంగా ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ గ్రాఫ్ అంత‌కంత‌కూ దిగజారుతోంది. దీనికి అధికార పార్టీ అనుస‌రిస్తున్న‌గొప్ప‌రాజ‌కీయ వ్యూహాలు కార‌ణ‌మ‌ని ఎవ‌రైనా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే..  అవును మరి… స్థానికంగా ఉన్న ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఆధిపత్య పోరే  ఇక్క‌డ వైసీపీకి శాపంగా మారింది. ఇంతా చేసి మ‌నం చెప్పుకునే వ్య‌క్తులు రాజకీయ ప్రత్యర్థులు కాదు.. వారికి వ్యక్తిగత గొడవలు […]

అబ్బాయ్ జ‌గ‌న్ కోసం రంగంలోకి బాబాయ్‌

జ‌గ‌న్ పార్టీ వైకాపా నుంచి ఆయ‌న బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్నారా అంటే ఇప్పుడు ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. త్వర‌లోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌తోపాటు క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న సొంత బాబాయి వివేకానంద రెడ్డిని పంపాల‌ని భావిస్తున్నారు. […]