టీడీపీలో ట్విస్ట్: ఏలూరు ఎంపీగా కొత్త క్యాండిడేట్..?

అధికార వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో ఏలూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏలూరు చాలా బలంగా ఉంది..ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది..రాష్ట్రంలో కొందరు ఎంపీలపై వ్యతిరేకత పెరుగుతుంది గాని..కోటగిరికి మాత్రం పెద్దగా వ్యతిరేకత లేదు. పైగా ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. దీంతో ఏలూరు పార్లమెంట్ లో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ […]

టార్గెట్ పులివెందుల..జగన్‌పై వ్యతిరేకత?

పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వేరే వాళ్ళు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఎప్పటినుంచో పులివెందులలో కాస్త ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి టీడీపీ కష్టపడుతూనే ఉంది. కానీ గత ఎన్నికల్లో మరీ దారుణంగా ఓడింది. దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఓడింది..ఇక జగన్ అద్భుతమైన విజయం సాధించారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్‌ని ఓడించడం జరిగే పని కాదు..ఆయన […]

వైసీపీకి ఒక్క ధర్మాన చాలు..!

అవును వైసీపీని దెబ్బకొట్టడానికి ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు చాలు అని ఆ పార్టీలోనే చర్చ జరిగే పరిస్తితి కనిపిస్తోంది. ఆయన వైసీపీని లేపుతున్నారో లేక..వైసీపీని కింద పడేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది..మంచి వాక్చాతుర్యం కలిగిన ధర్మాన..రాజధానిపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎప్పటినుంచో ఉత్తరాంధ్ర వెనుకబడిందని, విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని చెబుతున్నారు. కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటుకు అదే ప్రాంతానికి చెందిన ధర్మాన కూడా ఒక కారణమే..గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పలుమార్లు పనిచేశారు. […]

దేవినేనికి అసమ్మతి సెగలు..మైలవరంలో రిస్క్ తప్పదా?

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు..సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ..వచ్చే ఎన్నికల్లో స్థానికులకే సీటు అనే నినాదంతో ముందుకెళుతున్నారు. వాస్తవానికి దేవినేని సొంత స్థానం నందిగామ..అక్కడ వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఎస్సీ స్థానంగా మారడంతో ఉమా పక్కనే ఉన్న మైలవరంకు షిఫ్ట్ అయ్యారు. 2014లో గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు..2019లో తన ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ […]

కాకినాడలో తమ్ముళ్ళ రచ్చ..డ్యామేజ్ ఎక్కువే..!

కాకినాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ఇక్కడ కాపు వర్గమే గెలుపోటముల్ని ఎక్కువ శాసిస్తూ ఉంటుంది..ఆ వర్గం ఎటువైపు ఉంటే వారికి విజయం ఖాయమే. 2014లో కాకినాడ సిటీ, రూరల్ స్థానాల్లో టీడీపీ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో టీడీపీకి పవన్ సపోర్ట్ వల్ల రెండుచోట్ల గెలిచింది. 2019లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల రెండు చోట్ల వైసీపీ గెలిచింది. ఇక ఇప్పుడు పోరు ఆసక్తికరంగా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లో అటు వైసీపీకి […]

గుంటూరు వెస్ట్‌పై కన్యూజన్..జనసేనకు వదులుతారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దశాబ్దాల పాటు ఆ స్థానాల్లో టీడీపీ సత్తా చాటుతూ వస్తుంది..కానీ గత ఎన్నికల్లో కంచుకోటల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే గుంటూరు వెస్ట్, రేపల్లె స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి..వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ ఖాళీ అయింది..మద్దాలి అటు వెళ్ళడంతో కోవెలమూడి రవీంద్రని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే కోవెలమూడికి నెక్స్ట్ […]

సిక్కోలులో ధర్మానకు రిస్క్..టీడీపీకి మైనస్..!

ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ నేతలు ఎవరు ఉన్నారంటే వైసీపీలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, అచ్చెన్నాయుడు, తమ్మినేని సీతారాం, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వారు ఉన్నారు. ఇక వీరు రాజకీయంగా అన్నీ పదవులు చూసేశారు..గెలుపోటములు చూశారు. ఇంకా రాజకీయాల్లో సత్తా చాటుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తాము ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీనియర్లలో ఒకరిద్దరికే రిస్క్ ఉంది తప్ప..మిగిలిన వారికి పెద్ద […]

మళ్ళీ ఎమ్మెల్యేలకు క్లాస్..జగన్ టెన్షన్ అదే..!

నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న జగన్..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. ఓ వైపు పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ..మరో వైపు పార్టీని సైతం బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీపై జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఎమ్మెల్యేలతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాపుల్లో ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ ఇస్తున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు కూడా ఇవ్వనని వార్నింగ్ ఇస్తున్నారు. […]

ఆ నలుగురు మాజీ మంత్రులు జంపింగ్?

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ బలపడుతుంది..పైగా జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో పుంజుకుంటుంది..ఇక టీడీపీ-జనసేన కాంబినేషన్ సెట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరగనుంది. ఇక రాష్ట్ర రాజకీయాలని బట్టి కొందరు నేతలు పార్టీ మార్పులు సహజంగానే జరుగుతాయి. ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఈ జంపింగులు నవడటం ఖాయంగా ఉంటాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ఊపుని చూసి చాలామంది ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు టీడీపీ-జనసేన […]