టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు..సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ..వచ్చే ఎన్నికల్లో స్థానికులకే సీటు అనే నినాదంతో ముందుకెళుతున్నారు. వాస్తవానికి దేవినేని సొంత స్థానం నందిగామ..అక్కడ వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఎస్సీ స్థానంగా మారడంతో ఉమా పక్కనే ఉన్న మైలవరంకు షిఫ్ట్ అయ్యారు.
2014లో గెలిచి, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు..2019లో తన ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దూకుడుగానే పనిచేస్తూ వస్తున్నారు. అలాగే మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంతకు నెగిటివ్ పెరుగుతుంది..ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సర్వేల్లో కూడా వసంతకు అనుకూలత కనిపించడం లేదు. ఇక దేవినేనికి పాజిటివ్ కనిపిస్తున్న తరుణంలో మైలవరం టీడీపీలో వర్గ పోరు మొదలైంది. ఉమాపై అసంతృప్తిగా ఉన్న బొమ్మసాని సుబ్బారావు..సెపరేట్గా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇటీవల ఓ సభ పెట్టారు..ఆ సభలో ఉన్న ఫ్లెక్సీల్లో ఉమా బొమ్మ కూడా పెట్టలేదు. ఆ సభలో దేవినేని వద్దు ..బొమ్మసాని ముద్దు అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. మైలవరం సీటు స్థానిక నేత అయిన బొమ్మసానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో 2014లో తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి తప్పు చేశానని, అప్పుడు లబ్ది పొందినవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
అయితే మైలవరం నియోజకవర్గం గొల్లపూడికి చెందిన బొమ్మసాని గతంలో కాంగ్రెస్లో పనిచేశారు…2014లో వైసీపీలో చేరి మైలవరం సీటు ఆశించారు. కానీ ఆయనకు సీటు దక్కలేదు. వైసీపీ నుంచి జోగి రమేష్ పోటీ చేశారు. దీంతో బొమ్మసాని ఇండిపెండెంట్గా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో జోగిపై 7 వేల ఓట్ల పైనే మెజారిటీతో దేవినేని గెలిచారు.
ఇక ఇండిపెండెంట్గా దిగిన బొమ్మసానికి 11,210 ఓట్లు వచ్చాయి. అంటే ఈయన వైసీపీ ఓట్లు చీల్చేశారు. దీంతో దేవినేని తక్కువ మెజారిటీతో గెలిచి బయటపడ్డారు. తర్వాత బొమ్మసాని టీడీపీలోకి వచ్చారు. కానీ మైలవరంలో ఉమా..బొమ్మసానికి పెద్ద విలువ ఇవ్వడం లేదని, ఆయన వర్గం అసంతృప్తిగా ఉంది. ఆ అసంతృప్తిని తాజాగా బయటపెట్టారు. మరి ఇప్పుడు బొమ్మసాని గాని దేవినేనికి వ్యతిరేకంగా పనిచేస్తే..దేవినేనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది.