టి20 ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న టీమిండియా.. ఈనెల 10న ఇంగ్లాండు తో సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన… బట్లర్ సేనను ఓడించి ఫైనల్ కు వెళ్లాలని ఇండియాలో ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. అభిమానులు కోరుకున్న విధంగానే కొన్ని సెంటిమెంట్లు కూడా భారత్‌కు కలిసి వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే 2011లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన అప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు కూడా పునర్వతమయ్యాయి( గ్రూప్ దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి, సెమీస్ నుంచి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా బయటకు వెళ్లిపోయాయి, సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్‌లోను లోను ఇదే రిపీట్ అయింది) ఇవన్నీ భారత్ కు వరల్డ్ కప్ గెలవడానికి పరోక్షంగా ఉపయోగపడే సూచనలను అని తెలుస్తున్నాయి.
అయితే ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు కూడా వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఓ విషయం కొందరు భారత్ అభిమానులను కంగారుపడుతుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 1992 వన్డే వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజిలోనే ఇంటికి వెళ్ళిపోయింది.. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఫైనల్ లో ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ గెలిచి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం భారత్ సెమిస్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందని, పాకిస్తాన్ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ప్రపంచ కప్‌ను గెలుచుకుంటుందని పాకిస్తాన్ అభిమానులు కలలు కంటున్నారు.
ఈ సెంటిమెంట్ల మాట పక్కన పెడితే.. ఏ టీంలు ఫైనల్‌కు చేరుతాయో… ప్రపంచ విజేతగా ఏ టీం నిలుస్తుందో తెలియాలంటే నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్ వరకు ఆగాల్సిందే. దీనికన్నా ముందు నవంబర్ 9న జరిగే తొలి సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్- పాకిస్తాన్ మరుసటి రోజు నవంబర్ 10న జరిగే రెండో సెమీఫైనల్ లో భారత్- ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.