అధికార వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో ఏలూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏలూరు చాలా బలంగా ఉంది..ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది..రాష్ట్రంలో కొందరు ఎంపీలపై వ్యతిరేకత పెరుగుతుంది గాని..కోటగిరికి మాత్రం పెద్దగా వ్యతిరేకత లేదు. పైగా ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. దీంతో ఏలూరు పార్లమెంట్ లో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
వాస్తవానికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 3 టీడీపీ, 3 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒక స్థానంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ ఉంది. కానీ ఎంపీ విషయానికొచ్చేసరికి వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ టీడీపీ తరుపున మాగంటి బాబు ఉన్నారు గాని..ఆయన అంత ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మాగంటి కాస్త సైలెంట్ గా ఉన్నారు..పైగా ఫ్యామిలీలో పలు విషాద ఘటనలు జరిగాయి..దీంతో మాగంటికి ఇబ్బందులు పెరిగాయి.
అయితే ఇప్పుడుప్పుడే మాగంటి యాక్టివ్ అవుతున్నారు..కానీ అనుకున్న స్థాయిలో మాత్రం మాగంటి పనిచేయలేకపోతున్నారు. దీంతో మాగంటికి ప్రత్యామ్నాయం చూడటానికి టిడిపి అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో గారపాటి చౌదరీని టీడీపీలోకి తీసుకొచ్చి..ఏలూరు ఎంపీగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చేస్తుంది.
తపన ఫౌండేషన్ ద్వారా ఏలూరు ప్రజలకు సేవ చేస్తున్న గారపాటికి అక్కడ మంచి ఇమేజ్ ఉంది..ఆర్ధికంగా కూడా బలమైన నేత. కాకపోతే ఆయన ఇప్పుడు ఏలూరు బిజేపి పార్లమెంట్ నేతగా ఉన్నారు. ఒకవేళ బిజేపితో పొత్తు ఉన్న సరే ఏలూరు సీటు ఇవ్వడం కుదరదు. కాబట్టి ఆయన్ని టీడీపీలోకి తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా నిలబెడతారని తెలుస్తోంది. అటు జనసేనతో పొత్తు ఉంటే టీడీపీకి ప్లస్ అవుతుంది. ఇక్కడ జనసేనకు లక్ష ఓట్ల వరకు ఉన్నాయి. మొత్తానికి గారపాటిని టీడీపీలోకి తీసుకొచ్చి..ఏలూరు ఎంపీగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి.