కాకినాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ఇక్కడ కాపు వర్గమే గెలుపోటముల్ని ఎక్కువ శాసిస్తూ ఉంటుంది..ఆ వర్గం ఎటువైపు ఉంటే వారికి విజయం ఖాయమే. 2014లో కాకినాడ సిటీ, రూరల్ స్థానాల్లో టీడీపీ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో టీడీపీకి పవన్ సపోర్ట్ వల్ల రెండుచోట్ల గెలిచింది. 2019లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల రెండు చోట్ల వైసీపీ గెలిచింది.
ఇక ఇప్పుడు పోరు ఆసక్తికరంగా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లో అటు వైసీపీకి గాని, ఇటు టీడీపీకి పెద్దగా పాజిటివ్ కనిపించడం లేదు. అలా అని రెండుచోట్ల జనసేనకు సింగిల్‌గా గెలిచి బలం లేదు. అయితే ఇక్కడ రెండుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలపై నెగిటివ్ కనిపిస్తోంది..అలా అని టీడీపీకి పాజిటివ్ లేదు. కాకినాడ సిటీలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మేయర్ పావనిల వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి.
ఏ సీటు కోసం ఇద్దరు గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలిసింది..ప్రస్తుతానికి మాత్రం కొండబాబు ఇంచార్జ్‌గా ఉన్నారు..ఆయనకు యాంటీగా పావని వర్గం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాకినాడ రూరల్‌లో పరిస్తితి దారుణంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మీ, సత్తిబాబు దంపతులకు..మాజీ మంత్రి చినరాజప్పకు పడటం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయాక పిల్లి దంపతులు టీడీపీకి దూరమయ్యారు. మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వీరికి ధీటుగా రాజప్ప..తన వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాస్ బాబాతో సెపరేట్‌గా రాజకీయం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా గ్రూపు తగాదాలతో రెండు చోట్ల టీడీపీకి ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. అయితే ఈ రెండు చోట్ల వైసీపీకి పాజిటివ్ లేదు. దీంతో టీడీపీ-జనసేనలు గాని కలిస్తే..ఈ రెండు సీట్లని గెలిచేస్తాయి. ఇక పొత్తులో భాగంగా వీటిల్లో ఒక సీటు ఖచ్చితంగా జనసేనకు వెళ్ళే ఛాన్స్ ఉంది.