రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ బలపడుతుంది..పైగా జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో పుంజుకుంటుంది..ఇక టీడీపీ-జనసేన కాంబినేషన్ సెట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరగనుంది. ఇక రాష్ట్ర రాజకీయాలని బట్టి కొందరు నేతలు పార్టీ మార్పులు సహజంగానే జరుగుతాయి. ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఈ జంపింగులు నవడటం ఖాయంగా ఉంటాయి.
గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ఊపుని చూసి చాలామంది ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తు సెట్ అవుతున్న నేపథ్యంలో కొందరు అధికార పార్టీ నేతలు..ఆ రెండు పార్టీల్లో ఏదొక పార్టీలో చేరి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారట. అయితే ఊహించని విధంగా నలుగురు మాజీ మంత్రులు పార్టీ జంప్ చేయడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే..ఇందులో వాస్తవాలు అనేవి ఎవరికి క్లారిటీ లేదు. కానీ నలుగురు జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారని మాత్రం గాలి వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ వార్తలు నిజమవ్వచ్చు..కాకపోవచ్చు. ఇక ఆ వార్తలు బట్టి చూసుకుంటే..ప్రకాశం-గుంటూరు జిల్లాల్లోని మాజీ మంత్రులు పార్టీ జంపింగ్‌కు రెడీ అవుతున్నారట. పైగా వారు జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారే అని ప్రచారం ఉంది. మరి జగన్‌తో సన్నిహితంగా ఉండేవారు పార్టీ ఎందుకు మారతారు అనే డౌట్ ఉండొచ్చు. వారు అవసరం బట్టి పార్టీ మారతారని అంటున్నారు. ఇక ఇందులో నిజమెంత ఉందో తెలియదు.
అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రి సైతం పార్టీ మారడానికి రెడీగా ఉన్నారట. జనసేనలోకి వచ్చి…టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయాలని చూస్తున్నారట. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి సైతం పార్టీ మారాలని చూస్తున్నారట. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే..మరి ఇందులో ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.