‘ దేవర ‘ నైజాం, ఆంధ్ర బిజినెస్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు వస్తే సినిమాకు లాభాలంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో.. దేవర సినిమా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల్లో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అంతేకాదు బిజినెస్ వర్గాల్లో కూడా సినిమాపై భారీ చర్చ మొదలైంది. ట్రైలర్‌కు అడపా ద‌డప నెగటివ్ కామెంట్స్ వినిపించినా.. సినిమాపై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా రావడంతో.. కొంత ట్రేడ్ వర్గాల్లోనూ ఇది పాజిటివ్ గా మారింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్‌ బిజినెస్ల లెక్కలు ఏంటో.. ఆ డీటెయిల్స్ ఎంటో ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కోసరాజు హరికృష్ణ కలిసి ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాల్లో నటిన‌టుల రెమ్యునరేషన్లు, అలాగే సాంకేతిక నిప్పుణుల రెమ్యునరేషన్ కూడా కలిపి దాదాపు రూ.160 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాక్.

ఇక ప్రమోషన్ ఖర్చులతో కలిపి దాదాపు రూ.165 కోట్ల వరకు జరగవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్‌కు భారీగా రెస్పాన్స్ వస్తుందట. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ ఓ ఫ్యాన్సీ ధ‌రకు అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ బిజినెస్ విషయంలో భారీగా డిమాండ్ ఏర్పడిందని.. ఈ హక్కులను చేజాకించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎగబడినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమా ధియేటర్ హక్కులు సుమారు రూ.95 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. ఇక నైజం హక్కులు సుమారు రూ.42 కోట్ల పైచిలుకే. ఆంధ్ర, సీడెడ్‌ కలిపి రూ.53 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. అలా మొత్తంగా రూ.95 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆరేళ్ల గ్యాప్‌తో తారక్ సోలోగా వెండితెర‌పై క‌నిపించ‌నున్నాడు.

ఇలాంటి క్రమంలో తారక్ సినిమాకు అంత‌లా డిమాండ్ ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో దేవర బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకు భారీ టార్గెట్టే ఉందనడంలో సందేహం లేదు. ఎగ్జిబిటర్లు, కమిషన్లు, స్టేట్ టాక్స్, థియేటర్ ర‌న్, జిఎస్టి ఇలా అన్ని కలుపుకొని రూ.100 కోట్ల మేర షేర్ సాధించాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఈ సినిమా ధియేట్రిక‌ల్ రన్‌లోనే కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.210 కోట్ల మేర గ్రాస్ వ‌సుళ్ళ‌ను కల్లగట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న హైప్‌ రిత్య సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీ లెవెల్ లో వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఫస్ట్ పూర్తయిన తర్వాత వచ్చే టాక్‌ను బట్టి సినిమా తర్వాత కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. కనుక ఫస్ట్ షో తర్వాత వచ్చే టాక్ వ‌ర‌కు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది వేచి చూడక తప్పదు.