‘ దేవ‌ర ‘ ట్రైల‌ర్ చూశారా.. ఆచార్య సెగ‌లు క‌న‌బ‌డుతున్నాయే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరాటాల శివ కాంబినేషన్‌లో రూపొందించిన తాజా మూవీ దేవర. మోస్ట్ అమైటెడ్‌ మూవీగా ఈ సినిమా సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సముద్రతీరం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అదే సమయంలో కొంతమంది మాత్రం ఈ ట్రైలర్ లో తప్పులను వెతుకుతూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సీన్స్ ప్రజెంటేషన్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ దేవర సినిమాలో తండ్రి, కొడుకులుగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనన్నాడు. ఇప్పటికే ట్రైలర్లో దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఫాన్స్ కి దేవ‌ర‌ ట్రైలర్ విపరీతంగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కు చేరాయి.

ఇదిలా ఉంటే దేవరకంటే ముందు కొరటాల మెగాస్టార్, రామ్ చరణ్తో ఆచార్య సినిమా తూపొందించి డిజ‌స్ట‌ర్ టాక్ తెచ్చ‌కున్నాడు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో పూర్తిగా నిరశ వ్యక్తం చేశారు. ఇక ఆచార్య క‌థ పాదఘట్టం అనే ప్లేస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ పాదఘట్టం మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. దేవర ట్రైలర్ లోని కొన్ని ఎలిమెంట్స్‌ ఆచార్య పొదగట్టంలోని సన్నివేశాలతో పోల్చి చూపిస్తూ సోషల్ మీడియాలో దేవరను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది ట్రైలర్‌లో దేవర కంటెంట్.. కొరటాల శివ డీటెయిల్ విధానాన్ని ప్రశంసిస్తుంటే మరి కొంత మంది మాత్రం పాదఘట్టం, సముద్రమట్టం అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆచార్యలో పాదఘట్టం ఉన్నట్టే దేవరలో కూడా ఒక్క ప్రాంతం ఉందని.. అలాగే రామ్ చరణ్ పాత్రను దేవర పాత్రతో పోలుస్తూ.. సోనుసూద్ క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ పాత్రకు దగ్గరగానే ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే కేవలం ట్రైలర్లో కొన్ని సన్నివేశాలను ఇలా కట్ చేసి తమకు నచ్చినట్లుగా క్రియేట్ చేసి ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదని అభిమానులు ట్రోలర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కావాలనే సినిమా పై నెగెటివిటీ పెంచడానికి పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటివరకు దేవరకు మొదటి ట్రోల్స్ ఎదురైన తర్వాతే.. సక్సెస్ వచ్చింది. దేవర ప్రమోషనల్ కంటెంట్గా ఇప్పటివరకు వచ్చిన ప్రతిదానికి మొదట విపరీతంగా ట్రోల్స్ ఎదురై.. తర్వాత భారీ వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలా ఇప్పటికే ట్రైలర్ వ్యూస్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటివరకు దేవర ట్రైలర్ అన్ని భాషల్లో ఏకంగా 12 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది. ఇదే స్పీడ్ లో కొనసాగితే మరో 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ సాధించడం చాలా సులభం. ఇక తారక్ నుంచి దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలోగా వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. ఇక సినిమా రిలీజ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.. ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.