టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర కోసం మోస్ట్ ఎవైటెడ్‌గా టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ రాకతో ఈ వేడి మరింతగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన ట్రైలర్ గురించి టాక్ నడుస్తుంది. దేవర కథ ఇదే అంటూ ట్రైలర్ చూసినవాళ్లంతా తమకు తోచిన కథలను అల్లేసుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా ముగించుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం దేవర కమర్షియల్ గా గట్టెకే సత్తా ఉన్న సినిమా అని తెలుస్తుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్జేషన్, యాక్షన్, సముద్రం బ్యాక్ డ్రాప్.. ఇవన్నీ సినిమాకు హైలెట్ గా ఉండనున్నాయని కొరటాల శివ గట్టిగా నమ్ముతున్నారు.
అన్నిటికంటే ఎక్కువగా క్లైమాక్స్ పై ఆశలు పెట్టుకున్నారు టీం. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు ఈ కథను వేరే లెవెల్ కు తీసుకువెళ్తాయని టాక్ నడుస్తోంది. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఓ బలమైన ట్విస్ట్ కొరటాల ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ సెకండ్ పార్ట్ కి స్టార్టింగ్ కానుందట. ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న తారక్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. చివరి 40 నిమిషాలు వేరే లెవెల్‌లో ఉంటుందని ఆయన వివరించాడు. తారక్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఆ మాట చెప్పడానికి కారణం కూడా ఈ సినిమాలో ఉండే ట్విస్ట్‌లు, క్లైమాక్స్ అని తెలుస్తుంది. ఇక తారక్, జాన్వి కపూర్ మధ్య జరిగే లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ లో రానుందట. ఈ లవ్ స్టోరీ ఎంతలా అభిమానుల్లో రీచ్ అవుతుందన్న దాన్ని బట్టే దేవర బ్లాక్‌బస్టర్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే దేవరకు అసలు తిరుగుండదు అంటూ.. లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఎక్కకపోయినా యావరేజ్ మార్క్ అయితే దాటుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేతప్ప సినిమాపై మరే సందేహాలు లేవని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇటీవల క్లైమాక్స్ బాగుంటే సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నయో తెలిసిందే. సల్లార్, కల్కి క్లైమాక్స్‌లు ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ అవడానికి కారణమయ్యాయి. అదే నమ్మకం, ధైర్యం దేవర టీంకు కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ అంతా హాజరై సందడి చేశారు. త్వరలోనే హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ లెవెల్ లో జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి తెలుగులో కూడా ప్రమోషన్స్ జోరుగా సాగనున్నాయట.