దేవర సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తర్కెక్కుతున్న దేవర ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి అతి పెద్ద బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్‌తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ దేవరని రూపొందిస్తున్నట్లు ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. టీజర్, గ్లింప్స్, సాంగ్సే కాదు.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడే సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. దేవరకు మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ కాదని.. మొదట మరో స్టార్ హీరోతో సినిమా చెయాల్సి ఉంద‌ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ దేవర సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరు.. కారణమేంటి ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల దేవర ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన కొంతసేపటికే ఓ పోస్టర్ నెటింట తెగ వైరల్‌గా మారింది. అదేంటంటే ఏఏ 21. అల్లు అర్జున్ 21వ సినిమాగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా రాబోతుందని గతంలో పోస్టర్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. గీత ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నట్లు ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అంతే కాదు.. బన్నీ కూడా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూవీ రెడీ అయిపోతుందని అంత అనుకున్నారు.

అయితే కారణాలు తెలియవు కానీ.. ఈ సినిమాకు చేక్ ప‌డింది. ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు బన్నీ. అయితే అప్పట్లో అల్లు అర్జున్.. ఆచార్య సినిమా డిజాస్టర్ కారణంగా కొర‌టాల సినిమా పక్కన పెట్టారంటూ.. పుష్ప 2 సినిమా షూట్ లేట్ అవ్వడంతో కొరటాల శివ సినిమాను హోల్డ్‌లో పెట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం తెలియదు కానీ.. సినిమా మాత్రం పోస్ట్‌పోన్‌ అయిపోయింది. ఆ తర్వాత వెంటనే కొరటాల శివ.. ఎన్టీఆర్ తో తన సినిమాను ప్రకటించాడు. అదే దేవర. అయితే ప్రస్తుతం ఈ విషయం నెటింట‌ వైరల్‌గా మారడంతో.. దేవర సినిమాలో మొదట చేయవలసింది తారక్ కాదంటూ.. అల్లు అర్జున్ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అంటూ.. బన్నీ తప్పుకోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఆ సినిమా వెళ్లిందని నెటిజ‌న్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఏ 21 పోస్టర్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.