తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. శ్రీమంతం పిక్స్ వైరల్..!

స్టార్ బ్యూటీ చిత్రా శుక్ల‌ మా అమ్మాయి సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మ‌డు చూడగానే అచ్చ తెలుగు ఆడ‌పిల్ల‌ల‌.. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో అమ్మడు అందం, న‌ట‌న‌కు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో వ‌రుస‌ అవకాశాలు క్యూ క‌ట్టాయి. అయితే అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు.

Chitra Shukla: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్ వైరల్ - Telugu News | Tollywood Actress Chitra Shukla Announce Her Pregnancy, Shares Baby Shower Photos | TV9 Telugu

ఇలా తెలుగులో రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్క కమర్షియల్, ఉనికి, హంట్ లాంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. ఇక గతేడాది చిత్ర శుక్ల‌ పోలీస్ ఆఫీస‌ర్‌ వైభవ్ ఉపాధ్యాయ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా అమ్మడు`తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తన సిమంత ఫోటోలను షేర్ చేస్తూ తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది.

Chitra Shukla: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్ వైరల్ - Telugu News | Tollywood Actress Chitra Shukla Announce Her Pregnancy, Shares Baby Shower Photos | TV9 Telugu

చిత్రా శుక్ల‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సాంప్రదాయ బద్దంగా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న.. చిత్రా శుక్ల‌ తన సీమంతానికి సంబంధించిన ఫోటోస్‌ షేర్ చేయడంతో అవికాస్త క్షణాల్లో నెటింట‌ వైరల్ గా మారాయి. దీంతో ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నెటిజ‌న్స్ ఆమెకు విషెస్‌ తెలియజేస్తున్నారు. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Chitra Shukla: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్ వైరల్ - Telugu News | Tollywood Actress Chitra Shukla Announce Her Pregnancy, Shares Baby Shower Photos | TV9 Telugu