ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ సకస్స్ అందుకోవాలనే కసితో దూసుకుపోతుంది. భారత మూలాలు ఉన్న ఈ అమ్మడికి అక్కడ భారీగా మద్దతు అందుతుంది. మాజీ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలహారిస్ మధ్య పోటీ చాలా జోరుగా సాగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమొక్రటిక్, రిపబ్లిక్ అని అభ్యర్థుల మధ్య ప్రచారం స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ సరికొత్తగా ఆర్ఆర్ఆర్ సాంగు తో ప్రచారానికి రంగంలోకి దిగింది.
దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న కమలహారిస్.. భారతీయ సంతతికి చెందిన ఓటర్లను కూడా తనవైపు తిప్పుకునేందుకు సరికొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ కి హిందీ వర్షన్‌తో వీడియోలు రూపొందించి విజువల్స్ వచ్చేలా ఎన్నికల ప్రచార గీతాన్ని క్రియేట్ చేసి బయటకు వదిలారు. ఈ వీడియో ఇండియన్ అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ బుటోరియా రిలీజ్ చేయడం విశేషం. ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ ట్రెండింగ్‌గా మారింది. ప్రచార గీతం వస్తున్న క్రమంలో భారతీయ మూలాలు చెందిన పలువురు వ్యక్తులు కామెంట్లను కూడా పార్టీ నేతలు అందులో జత చేశారు.
దక్షిణాసియాకు చెందిన వారు అమెరికాలో భారీగానే ఉన్న సంగతి తెలిసిందే. ఇక సుమారు 60 లక్షల ఓట్లు దక్షిణాసియాకు చెందిన వారికి ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వారి ఓట్లు ఎటువైపు మద్దతు ఇస్తే వారితో గెలుపు అని అక్కడ ట్రెండ్ మొదలైంది. కమలహారిస్ తల్లి.. శ్యామల గోపాలం ఇండియాకు చెందిన వ్యక్తి. శ్యామల తండ్రి పీవీ గోపాలం ది తమిళనాడు కావడం విశేషం. శ్యామల 1958 లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లి అక్కడే డాక్టరేట్ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్ పై ఎన్నో పరిశోధనలు జరపారు. ఈ క్రమంలోనే జిమైకాకు చెందిన డ్రోనాల్డ్ హరీస్ ను వివాహం చేసుకున్న శ్యామల.. కమలహారిస్ కు జన్మనిచ్చింది. ఆమెకు మరో కూతురు మాయ హారీస్ కూడా ఉంది.