టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రాకు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయితే అదే సమయంలో తమిళ్, హిందీ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే చాలాకాలం తర్వాత ఉత్సవం సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది.
ఇందులో భాగంగా రెజీనా మాట్లాడుతూ.. తన మొదటి సినిమా గురించి చెప్పుకొచ్చింది. నేను కాలేజీలో చదువుకునే టైంలోనే నాకు సినిమా అవకాశాలు వచ్చాయని.. తెలుగులో ఆడిషన్స్ ఇచ్చి అనుకోకుండా ఒకేసారి రెండు సినిమాలకు సెలెక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. శివ మనస్సులో శృతి, శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ ఈ రెండు సినిమాల్లో నాకు అవకాశం వచ్చిందని.. కానీ ఒక సినిమాకు మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. దీంతో శివ మనసులో శృతి సినిమాను ఎంచుకున్నా. ఆ టైంలో ఏ మూవీ చేయాలో కూడా తెలియని పరిస్థితి నాది. కానీ.. నాకు అలా స్టార్టింగ్ లోనే రెండు సినిమాలకు ఒకేసారి అవకాశం రావడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది అంటూ రెజీనా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో మొదట రెజీనాకు అవకాశం వచ్చిందా.. అనవసరంగా ఆ సినిమాలో ఛాన్స్ ను మిస్ చేసుకుందే అంటూ.. శివ మనసులో శృతి బదులు.. శేఖర్ కమ్ముల నటించిన సినిమాలోనే నటించి ఉండాల్సింది.. కెరీర్ మొదటి లోనే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావ్ అంటూ.. ఈ సినిమాలో నటించి ఉంటే సక్సెస్ వచ్చి ఉండేది. అలాగే శేఖర్ కమల ఫ్యూచర్ సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉండేదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.