ఈ గోల్డెన్ బ్యూటీని గుర్తుపట్టారా.. అమ్మడు సినిమా చేస్తే సూపర్ హిట్ పక్కా.. !

ఈ పై ఫోటోలో తన క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ బ్యూటీ. తన అందం, అభినయంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. పేరుకు మలయాళ బ్యూటీ అయిన టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే టాలీవుడ్‌లో ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీ. తెలుగులో అమ్మడు నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌లే. కాగా గ‌త‌ కొంతకాలంగా అమ్మడు సినిమాల్లో సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఒకే ఒక్క టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమాలో మాత్రమే నటిస్తుంది. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలైనా గోల్డెన్ లెగ్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

സദ്യയ്ക്ക് മുന്നിലും കഥ പറച്ചിലിൽ മുഴുകി മിടുക്കികൾ; ഈ ചിത്രത്തിലെ നടിയെ  മനസ്സിലായോ?

ఆమె మరెవరో కాదు సంయుక్త మీనన్. నేడు(11 సెప్టెంబ‌ర్‌) ఈ అమ్మడి పుట్టినరోజు సందర్భంగా ఈమె చిన్ననాటి ఫోటోస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం సినీ ప్రముఖులు , అభిమానులు అంతా ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఈ అమ్మడు మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించిమెప్పించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా, రానా విలన్‌ పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో అడుగు పెట్టింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆకట్టుకున్న ఈ మలయాళ‌కుటికి.. తర్వాత కళ్యాణ్ రామ్ సరసన సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంయుక్త.. తర్వాత ధనుష్‌తో కలిసి సార్ సినిమాలో ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్లోను బ్లాక్ బస్టర్ అందుకుంది.

Samyuktha look from Nikhil's Swayambhu unveiled on her birthday - News -  IndiaGlitz.com

ఇక మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన నటించిన విరూపాక్ష సినిమా అయితే ఏకంగా వంద కోట్లు కలెక్షన్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను నటించి గోల్డెన్ బ్యూటీగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంయుక్త.. తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లో నెమ్మదించింది. కళ్యాణ్ రామ్‌తో తీసిన డెవిల్ కమర్షియల్‌గా ఫ్లాప్ కావడంతో.. అమ్మడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలోని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంయుక్త.. దిల్ రాజు కొడుకు ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మీ సినిమాలో దివ్యవతి పాత్రలో ప్రేక్షకులను భయపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ హీరోగా రూపొందుతున్న‌ స్వయంభూ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం అమ్మ‌డి చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా స్వయంబునే. అయినా మలయాళంలో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీగా గడుపుతుంది.