రాజ‌మౌళి వ‌ల్ల నా పిల్లలు నాద‌గ్గ‌ర‌కు రావ‌డం మూనేశారు.. ఆరోజు ఆల్మోస్ట్ చ‌నిపోయా..

ద‌ర్శ‌కధీరుడు రాజమౌళికి.. పాన్‌ ఇండియా లెవెల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన సినిమాలో విలన్ పాత్రకు కూడా హీరోకి ఏమాత్రం తగ్గకుండా పవర్స్ ఉంటాయి. ఎంతటి పవర్ఫుల్ విలన్‌ని హీరో ఎలా ఓడించాడు అనే అనుమానాలు ఆడియన్స్ కు వచ్చే రేంజ్‌లో సినిమాలు తెర‌కెక్కిస్తూ ఉంటాడు జక్కన్న. అలా సై, సింహాద్రి, ఛత్రపతి, ఈగ, బాహుబలి ఇలా రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాలోను భయంకరమైన విలన్‌ పాత్రలు ఉంటాయి. అలా విక్రమార్కుడు సినిమాలో విలన్ గా నటించిన తెలుగు నటుడు అజయ్ పోషించిన టిట్లా పాత్ర కూడా ఒక‌టి. అజయ్ క్యారెక్టర్ ఈ సినిమాలో భయంకరమైన కటౌట్ తో.. కౄరంగా డిజైన్ చేశాడు జక్కన. కెరీర్‌ మలుపు తిప్పిన సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. విక్రమార్కుడు సినిమా అజయ్ కు ఎంతో ప్లస్ అయింది. అయితే ఈ సినిమా టైంలో ఆయనకు నెగిటివ్ అయిన అంశాలు కూడా ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అజయ్.

Vikramarkudu | Cinema Chaat

ఆయన విక్రమార్కుడు సినిమా గురించి మాట్లాడుతూ.. తను నటించిన సినిమాల‌ని ఆ మూవీతో పోల్చడం అంతా మొదలుపెట్టారని.. విక్రమార్కుడులో గెటప్ చూసి నా పిల్లలు కూడా చాలా కాలం వరకు నా దగ్గరికి రావడానికి భయపడ్డారు.. మనసుకు చాలా బాధగా అనిపించేది.. అంటూ అజ‌య్‌ చెప్పుకొచ్చాడు. విక్రమార్కుడు క్లైమాక్స్ షూటింగ్లో ఇన్సిడెంట్ జరిగిందని. ఫైట్ టైంలో నన్ను రోప్ తో పైకి లాగుతారు. అయితే క్రేన్ సహాయంతో ఆ షూటింగ్ చేశారు. అసిస్టెంట్స్‌ కొందరు సరిగ్గా గమనించి ఉండరు. ఆ రోప్ టైట్ గా లేకపోవడం వల్ల క్రేన్‌ రోడ్ నా తలకి తగిలింది. కరెక్ట్ గా క్షణకాలంలో చావు తప్పినట్లయింది. అప్పటికి కొంచెం గాయమైంది. ఆ టైంలో నా తలకి డమ్మీ బ్లడ్ పెట్టి ఉన్నారు. అది బయటకు వచ్చేసింది. నేనైతే ఆల్మోస్ట్ చనిపోయాను అనుకున్నా. అది నిజమైన రక్తమా.. డమ్మీ రక్తమా కూడా నాకు అర్థం కావడం లేదు. నాన్న, పిల్లలు, భార్య అందరు కళ్ళముందే తిరుగుతున్నారు.

Actor Ajay About Vikramarkudu Villain Character | Ajay Interview | Special  Telugu Movie | Film Jalsa - YouTube

రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఉన్నారు. ఆయనకు మాత్రమే ఏం జరిగిందో అర్థమైంది. మిగిలిన వాళ్లకు సరిగ్గా తెలియడం లేదు. క్రేన్ నా దగ్గరికి వచ్చి ఆగిన వెంటనే రాజమౌళి గారు చచ్చాడు అంటూ ఒక్కసారిగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అప్పటికి క్రేన్‌కి సంబంధించిన ఒక రాడ్ నా కాళ్ళకి పడిపోయింది. రాజమౌళి గారు పరిగెత్తడంతో అందరూ అక్కడికి వచ్చేసారు. క్షణకాలంలో క్రేన్ ఆగకపోయి ఉంటే నా తల పగిలిపోయేది అంటూ అజయ్ వివరించాడు. అప్పటికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం.. కాస్త రెస్ట్ తీసుకోమని రాజమౌళి అన్నారు. పర్వాలేదు సార్ నేను చేస్తా అని చెప్పి షూటింగ్ పూర్తి చేశా అంటూ అజయ్ వివరించాడు. ఫిజికల్ గా కూడా నాకు విక్రమార్కుడు సినిమా చాలా కష్టమైంది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా నాపై నెగటివిటీ బాగా తీసుకువచ్చిందని.. తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఇష్క్ సినిమాలతో పాజిటివ్ ఇమేజ్ వచ్చిందని వివరించాడు. ప్రస్తుతం అజయ్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి.