నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఎంత స్టార్‌డంను అనుభవిస్తున్నా.. చూడడానికి కూల్ గా, పక్కింటి కుర్రాడులా సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. అతను వేసుకునే దుస్తులు, పెట్టుకునే యాక్ససరీస్ నుంచి ఆయన ఇతరులతో మాట్లాడే చనువు వరకు అంత చాలా సింపుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తను వేసుకునే దుస్తులు, యాక్సిసరీస్ కళ్ళకు కనిపించినంత సింపుల్‌గా మాత్రం కాస్ట్‌లు ఉండవంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందరి సెలబ్రిటీస్ లక్షల ఖరీదు చేసే దుస్తులు, యాక్సిస్సోరీస్ లు వాడతారు. అలానే తారక్ చూడడానికి సింపుల్గా కనిపించిన ఆయన వేసుకునే దుస్తుల కాస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుందట.
ఇక తాజాగా ముంబైలో దేవర ట్రైలర్ లాంచ్ గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ హాజరై సందడి చేశారు. కాస్త డిఫరెంట్ గా ఉండే బ్లాజర్ ను ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చేతుల దగ్గర డిజైన్ కాస్త కొత్తగా ఉన్న బ్లాక్ లేజర్ ని ధరించి ఎట్రాక్ట్ చేశాడు. సెన్స్ అనే బ్రాండ్ కు చెందిన ఈ బ్లాక్ బ్లేజర్.. అక్షరాల రూ.46వేలు అని తెలుస్తుంది. ఇక బ్లేజర్ లోపల.. నలుపు రంగు సింపుల్ రౌండ్ నెక్ టీ షర్ట్ ను వేసుకున్నాడు. ఇక ఆ షర్ట్ మీరి అనే బ్రాండ్ కి సంబంధించింది. దీని రేటు కూడా దాదాపు రూ.50 వేలు ఉంటుందని సమాచారం.
ఇక ఈ ప్రమోషన్స్లో తారక్ రెగ్యులర్గా ఒకే రకమైన షూ తో కనిపించాడు. బ్యాలెన్సీగా అనే కంపెనీకి చెందిన ఈ షూ ధర దాదాపు ఒక్క లక్ష వరకు ఉంటుందట. ఇక దాదాపు ఏడాదిగా ఇదే బ్రాండ్ షొను తారక్ వాడుతున్నాడు. ఇక ఆయన ధరించే వాచ్ ఖరీదు ఇప్పటికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ దగ్గర ఓడామారా పీగే బ్రాండ్ వాచ్ ఉంది. ఇక కేవలం ఈ వాచ్ కాస్టే కోటి రూపాయలను మించి ఉంటుంది. ఈ క్రమంలో తారక్‌కు వేసుకున్న దుస్తులు, యాక్ససిరీస్ కాస్ట్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎన్టీఆర్ లెవల్‌కు ఆ మాత్రం కాస్ట్ ఉండడంలో తప్పులేదు అంటూ మరికొందరు అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.