టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆచార్య ప్లాప్ తర్వాత వచ్చిన విమర్శల క్రమంలో దేవర సినిమాను ఎన్టీఆర్తో ప్రారంభించాడు కొరటాల. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో గ్రాండ్ లెవెల్ లో ప్రారంభించారు టీం. మంగళవారం( సెప్టెంబర్10వ తేది) సాయంత్రం ఐదు గంటలకు దేవర టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో కొరటాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొరటాల సినీ కెరీర్ ఫాలో అవుతున్నప్పుడు నాకు ఆయనపై ఇంట్రెస్ట్, గౌరవం పెరిగింది కానీ.. ఏ మాత్రం తగ్గలేదు.
ఆయన సినీ ఇండస్ట్రీకి ఇచ్చిన బ్లాక్‌బస్టర్ల వల్ల ఆయనపై విపరీతమైన ఒత్తిడి ఉంది. అలాంటి ఒత్తిడి తట్టుకుంటూ సినిమాలు తీస్తాడు. ఎప్పుడు ఆయన మైండ్‌లో సినిమా తప్ప మరో థాట్ ఉండదు అంటూ ఎన్టీఆర్ వివరించాడు. ఎప్పుడు సినిమా కథతోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడని.. వేరే విషయాలపై ఆయన ఫోకసే ఉండదు. ఎప్పుడు కథ గురించి.. సినిమాలో సన్నివేశాల గురించి.. ఆయన మైండ్ పెడతాడు. అలాంటి టైం లో అతనికి సరైన ప్లేస్, సరైన వ్యక్తులు పక్కన ఉండాలి. అంతే అతను అద్భుతమైన సినిమాలు అందిస్తాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మెగా అభిమానులను ఎక్కడో టచ్ చేశాయి.
ఆచార్య ఫలితం గురించే ఆయన ఇలాంటి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నాడని.. ఆచార్య ప్లాప్ వెనుక ఆయన తప్పేమీ లేదు.. సరైన వ్యక్తులు లేకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారని.. పెడదార్థాలు తీస్తూ తారక్ పై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దేవర ట్రైలర్ రిలీజ్ ఆడియనస్‌లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అప్పుడే కొందరు యింటీ ఫ్యాన్స్, టిడిపి అభిమానులు ట్రైలర్ చూసి ట్రోలింగ్స్ కూడా మొదలెట్టేశారు. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ప్రారంభమైపోయింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ సమయానికి సినిమాపై ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో వేచి చూడాల్సిందే.