నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడుగా మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన ఈయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. సినీ ప్రియులకు, నందమూరి అభిమానులకు.. అందరికీ ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్‌గా నిలిచింది. ఇక మోక్షజ్ఞ డబ్బింగ్ మూవీ బాధ్యతలు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు బాలయ్య. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి.. గ్రాండ్ లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ సోదరి తేజస్విని ఎస్.ఎల్. వి బ్యానర్స్ పై సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. పురాణాలు, సోషల్ కథంశంతో మిక్స్‌చేసి ఈ సినిమాను తీయనన్నారు.
ఈ సినిమాల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటించనున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోలుగా బాలకృష్ణ, తారక్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా తారక్ ఇటీవల మోక్షజ్ఞ కు బర్త్ డే విషెస్‌తో పాటు.. సినీ రంగంలోకి సక్సెస్ రావాలంటూ విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. తారక్ తో పాటే కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమాను మరింత అట్రాక్టివ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇద్దరు స్టార్లు ఉండాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇందులో భాగంగా శ్రీకృష్ణుడు పాత్రలో బాలయ్య నటించే అవకాశం ఉందని టాక్. ఇక బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల క్యామియో రోల్స్‌కు ప్రాధాన్యత ఎక్కువవుతుంది. సినిమాలు హిట్ అవ్వడానికి క్యామియో రోల్స్ లో నటించిన హీరోలు కూడా ఒక కారణంగా ఉంటున్నారు.
అలాంటి పాత్రలు మోక్షజ్ఞ సినిమాలో కూడా ఉండాలని బాలయ్య భావిస్తున్నారట. ఇక గత కొంతకాలంగా తారక్, నందమూరి కుటుంబ సభ్యులు, బాలయ్యకు మధ్యన విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు అయిన క్రమంలో కూడా తారక్ దీనిపై ఏమాత్రం స్పందించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనపై మండిపడ్డాయి. అయితే రాజకీయాలు, సినీ రంగానికి చెందిన ఓ వ్యక్తి వీరి మధ్య సంధి కుదిర్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. జరిగినదేదో జరిగిపోయింది.. అదంతా మర్చిపోయి.. విభేదాలు, కలహాలు ఏమీ లేకుండా హుందాగా కలిసి ఉంటే ఎన్టీరామారావు పేరు చెక్కుచెదరకుండా నిలిచిపోతుందని.. సినీ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకోవాలంటే నందమూరి కుటుంబం అంతా కలిసికట్టుగానే ఉండాలి.. అదే మంచిది అని ఆయన సర్ది చెప్పాడట. దీంతో తారక్ కూడా మోక్షజ్ఞ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. కొద్దిరోజులు ఆగితే గాని దీనిపై క్లారిటీ రాదు.