టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవరికి అందనంత వేగంగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అయితే ఇటీవల కాలంలో ఆయనకు బ్యాడ్ లక్ నడుస్తుంది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇక హిట్లు, ఫ్లాప్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్న ఈయన.. ముఖ్యంగా ధమాకా సినిమా తర్వాత మరోసారి అలాంటి సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. అయితే తాజాగా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐటి డిపార్ట్మెంట్ లోని సిన్సియర్ ఆఫీసర్ నేపథ్యంలో కమర్షియల్ మూవీగా ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే దానికి ఏమాత్రం తీసిపోని విధంగా హైయెస్ట్ బిజినెస్‌లు జరుపుకొని ఎంతో గ్రాండ్గా సినిమా రిలీజ్ అయింది. ఇక పక్క మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమా రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
దీంతో ఆరంభంలోనే అనుకున్న విధంగా వసూళ్లు దక్కించుకోలేకపోయింది. తర్వాత కూడా సినిమా ఏ మాత్రం పుంజుకోలేదు. దీంతో రిలీజ్ అయిన వారానికే సినిమా రన్ టైం ముగించుకొని డిజాస్టర్ గా నిలిచింది. సినిమా ప్లాప్ తో రవితేజ సినిమా కోసం తాను తీసుకున్న నాలుగు కోట్ల రమ్నరేషన్ను తిరిగి ఇచ్చేసాడు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రెండు కోట్ల నిర్మాతకు తిరిగి అప్పగించాడు. ఇకపోతే రవితేజకు ఈ సినిమాతో పాటు గతంలో మరింత బారినష్టాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన సినిమా ఇంకోటి ఉంది. అదే కిక్ 2.. గతంలో కళ్యాణ్‌రామ్ నిర్మాతగా.. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇంత సినిమా లాస్ట్ వెంచర్గా మిగిలిపోయి కళ్యాణ్ రామ్‌కు నష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కి సూపర్ హిట్గా నిలిచిన కిక్ సినిమాకు ఇది రీమేక్ వచ్చింది.
ఈ సినిమాకు కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2015లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక మొదటి నుంచి భారీ అంచనాలతో రిలీజ్ అయిన డిజాస్టర్‌గా నిలిచింది. ఇక దాదాపు రూ.42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌లు జరిగినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.17 కోట్ల కలెక్షన్లు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో నిర్మాత కళ్యాణ్ రామ్ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇందులో భాగంగానే కళ్యాణ్ రామ్ తన విలువైన ఆస్తులు ఎన్నింటినో కొంతకాలం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి కారణం మరొకటి కూడా ఉంది. అప్పటివరకు నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన అతనొక్కడే సినిమా మాత్రమే సూపర్ సక్సెస్ అందుకుంది. తర్వాత ఆ బ్యానర్ లో సరైన హిట్ లేకపోవడం.. అన్ని సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టడమే దానికి ప్రధాన కారణం. ఈ క్రమంలో కిక్ 2 సినిమా తెరకెక్కి మరిన్ని నష్టాలను తెచ్చి పెట్టింది. ఇక నష్టాలనుంచి బయటపడడానికి కళ్యాణ్ రామ్‌కు చాలా సమయం పట్టింది. ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన జై లవకుశ సినిమా కళ్యాణ్ రామ్ తాకట్టు పెట్టిన విలువైన ఆస్తులన్నీ వెనక్కి వచ్చేలా చేసింది.