తమిళ్ సూపర్ స్టార్ విజయ దళపతి.. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్‌కు ఫ్యామిలీ నుంచి తలనొప్పులు ఎదురయ్యేలా ఉన్నాయి అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. చాలాకాలంగా విజయ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి కారణం విజేయ్‌ను తన మ్యానేజర్ పక్కదారి పట్టించడమేనట. ఈ క్రమంలో విజయ్ కొడుకు సంజయ్ వెళ్లి.. అతని కొట్టాడని టాక్ కూడా నడుస్తుంది.
ఈ వ్యవహారం వెనుక ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పటి నుంచే విజయ్.. తన భార్య, కొడుకుకు దూరంగా ఉంటున్నాడట. ఈ కారణంతోనే సొంత కొడుకు తప్పుడు మాటలు విని పెడదోవ పట్టాడని.. తండ్రి పాలిట విలన్ గా మారాడని.. రియల్ కథనే.. తనే కొడుకుని చంపినట్లు గోట్ సినిమా కదా అల్లించాడంటూ ఇప్పుడు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. విజయ్‌కి తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు పడదని.. గతంలోనే పలు సంఘటనలు వెలువడ్డాయి.
దానికి తగ్గట్లుగానే తాజాగా భార్య. కొడుకు వ్యవహారం వైరల్ గా మారుతుందిజ ఇక విజయ్ కొడుకు సంజయ్‌ను ఎలాగైనా దర్శకుడు చేయాలని తల్లి పట్టుదలతో ప్రయత్నించి.. లైకా సంస్థల సందీప్‌కిషన్‌తో ప్రాజెక్టును ఫిక్స్ చేశారని ఇన్సైడ్ వర్గాల టాక్. మొత్తం మీద ఈ గుసగుసలు ఎంతవరకు వెళతాయి అనేది మాత్రం సందేహమే. విజయ్ ఎన్నికల బరిలో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ వార్తలన్నీ బయటకు వస్తాయి. ఫ్యామిలీ ఎదురుగా నిలుస్తుందని.. చెన్నై వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. అప్పుడు ఏకంగా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిన ఆశ్చర్యం లేదట.