రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. ట్రైలర్(వీడియో)..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ నెల 27న భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు దేవర రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దాం అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ నెటింట‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Is Devara trailer release date confirmed? Here is the truth | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం అంటూ ఇప్పటికే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొదటినుంచి వార్తలు వినిపిస్తున్నట్లుగానే రెండు నిమిషాల 39 సెకెన్ల‌ ట్రైలర్ కట్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించాడు కొరటాల. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ నుంచి.. ట్రైలర్‌లో చూపించిన ప్రతి ఒక్క డైలాగ్ ఆడియన్స్‌లో సినిమాపై మరింత అంచనాలను రెట్టింపచేసేలా డిజైన్ చేశారు.

ఇక ఈ సినిమాలో ఫైట్ సీన్స్.. మాస్‌ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయ‌న‌టంలో సందేహం లేదు. ప్రకాష్ రాజ్‌ వాయిస్ ఓవర్ తో దేవర ట్రైలర్ మొదలైంది. కులం లేదు.. మతం లేదు భయం అసలే లేదు.. ధైర్యం తప్ప ఏదీ లేని కళ్ళల్లో మొదటిసారి భయం పొర‌లుకమ్ముకున్నాయి అంటూ మొదలైన ట్రైలర్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ ట్రైల‌ర్‌తో దేవ‌ర డ్యూయ‌ల్ రోల్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను మీరు ఓ లుక్ వేసేయండి.