దేవర ‘ కోసం రాజమౌళి సలహాలు పాటిస్తున్న తారక్.. అలా చేయనున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గతంలో రాజమౌళి తనకు మంచి స్నేహితుడు కాదు.. తన లైఫ్ లోనే కీలకమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎన్టీఆర్ ప్రతి విషయంలో రాజమౌళి జడ్జిమెంట్‌ని విశ్వసిస్తాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక జక్కన్న విషయానికి వస్తే ఆయన డైరెక్టర్ గా పరిచయమైంది ఎన్టీఆర్ సినిమాతో. ఇక ఎన్టీఆర్ నటనకు జక్కన్న ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించారు. రాజమౌళి భావాలను ఎన్టీఆర్ బాగా అర్థం చేసుకుంటాడని తను వివరించాడు. కాగా ఎన్టీఆర్ తన ప్రతి విషయానికి సంబంధించిన కీలక నిర్ణయాలలో రాజమౌళి సలహాలను కూడా తీసుకుంటూ ఉంటాడు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి.. ఎందుకంటే? |  Director Rajamouli about jr ntr RRR role first glimpse - Telugu Filmibeat

ఈ క్రమంలోనే తాజాగా దేవర ప్రమోషన్స్ విషయంలోనూ జక్కన్న సలహాలను సూచనలను ఎన్టీఆర్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడ విన్న దేవర పేరు వినిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ తారక్ వార్త‌లే. దేవర నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దేవర ట్రైలర్ రిలీజ్ అప్డేట్ షేర్ చేయడం.. ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లడం, డైరెక్టర్ సందీప్ రెడ్డితో ముచ్చటించడం ఇలాంటి విషయాలన్నీ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో దేవర ప్రమేషన్స్ కు ఎన్టీఆర్ స్ట్రాటజీ ఇదేన‌ట. ముంబైలో గ్రాండ్ లెవెల్ లో నేడు దేవర ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కు సినిమా కోసం పనిచేసిన మేజర్ కాస్ట్ అండ్ క్రూ అంతా సందడి చేయనున్నారు. ముఖ్యంగా జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారని టాక్.

Devara: Part 1 OTT & Theatre Release Date Revealed

ట్రైలర్ లాంచ్ కంటే ముందే ఎన్టీఆర్ ముంబై వెళ్లి ప్రమోషన్స్ కోసం అక్కడ పేరు ఉన్న మీడియా హౌస్ లతో ఇంట్రాక్ట్ అయినట్లు తెలుస్తుంది. తమ దేవర సినిమా రిచ్ బాగా ఉండాలని రీతిలో అక్కడ ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ తెరలేపుతున్నారట‌. ఈ క్రమంలోనే మరికొద్ది రోజులు ముంబైలో ఎన్టీఆర్ ఉండి ఇంటర్వ్యూల‌లో పాల్గొన్ననున్నారని తెలుస్తుంది. అలాగే కమల్ శర్మ షో కు తారక్.. షూట్ ను పూర్తిచేసుకున్నారట. సందీప్ వంగ‌తో ఇంటర్వ్యూ కూడా జరిగినట్లు సమాచారం. పూర్తిగా హిందీ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టిన తారక్.. దేవర సినిమా ప్రభావం వార్ 2 సినిమాపై కూడా ఉంటుందని భావిస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్‌తో వచ్చిన ఇమేజ్‌ని ఈ సినిమాతో రెట్టింపు చేసుకోవాలని ఎన్టీఆర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. బాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకోవడానికి తారక్‌ చూస్తున్నాడని తెలుగు ప్రమోషన్స్ పట్టించుకోవడం లేదంటూ కొంత‌మంది ఫైర్ అవుతున్నారు.

Devara - Part 1 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఇక ఫైనల్ గా ఈరోజు వచ్చే ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాను షేక్‌ చేయనుందట. రెండు నిమిషాల 50 సెకండ్ల ట్రైలర్ను డైరెక్టర్ కొరటాల శివ కట్ చేసినట్లు సమాచారం. ట్రైలర్ను ముంబై మీడియాకు ముందు రిలీజ్ చేసి.. ఒకసారి గా నార్త్‌ బెల్ట్ దృష్టి తమ సినిమాపై పడేలా చేసుకోవాలనే వారి ఆలోచన అని తెలుస్తుంది. మొదటి నుంచే ఎన్టీఆర్ హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారనేది వాస్తవం. ఈ క్రమంలోనే జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ను తీసుకొని నటింపజేయాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారట. అలాగే డైరెక్టర్ సందీప్ వంగా, ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేయనున్నారని.. కచ్చితంగా ఇది హైలెట్ అవుతుందని తెలుస్తుంది. గతంలో సందీప్ యానిమల్‌తో ఎలాంటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ వంగాకు ఉన్న క్రేజ్ రీత్యా ఎన్టీఆర్‌ను సందీప్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. తెలుగు సినిమాగా దేవర పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ ఎలాగూ తప్పవు. అయితే తెలుగు సినిమా కావడంతో ఇక్కడ ఆడియ‌న్స్ అటెన్షన్ ఎలాగూ దేవరపై ఉంటుంది. రాజమౌళి గతంలో తన సినిమా విషయంలోనూ ఇలానే చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన సలహాలు, సూచనలు మేరకే ఎన్టీఆర్ కూడా దివ‌ర ప్ర‌మోష‌న్స్ ఇలా చేస్తున్నాడని టాక్‌.