యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా మోస్ట్ ఎవైటెడ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు SSMB 29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఆడియన్స్ లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ సార్ హీరో మాధవన్ కీలకపాత్రలో ఫైనలైజ్ అయ్యారని టాక్ నడుస్తుంది. ఇక మహేష్, మాధవన్, పృథ్వీరాజ్ లాంటి స్టార్ కాస్టింగ్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు ఆడియన్స్ లో వేరే లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసుకుంటుంది. ఈలాంటి క్రమంలో దర్శకతీరుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ కోసం ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ సైతం ఎదురుచూస్తున్నారు.
వాగా అలాంటి రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న.. ఈ బిగ్ బడా ప్రాజెక్టులో నటించే ఛాన్స్ వచ్చినా.. అది కూడా ఏకంగా రూ.20 కోట్లు ఆఫర్ చేసిన సరే.. ఓ స్టార్ నటుడు దాన్ని రిజెక్ట్ చేశాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ అన్‌లక్కీ పర్సన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అ నటుడు మరెవరో కాదు. బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్. ఎస్.. SSMB 29 లో ఓ కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ను టీం అప్రోచ్ అయ్యారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఏకంగా ఆ పాత్ర కోసం రూ.20 కోట్లు ఆఫర్ చేశారట మేకర్స్.
అయినా నానా పటేకర్ మాత్రం ఈ పాత్రలో నటించడానికి డైరెక్ట్ గానే నో చెప్పేసాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కెరీర్‌లో ఆయన చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినట్లే అవుతుంది. ఇటీవల నాన్న పటేకర్ నటించిన హౌస్ ఫుల్ 5 విమర్శలు ఎదుర్కొంది. సినిమాల్లో కంటెంట్ లేదు సరికదా.. కనీసం కామెడీ లేకుండా బూతులతో నిండిన ఇలాంటి మూవీలో నటించడంతో అసలు తన క్రేజ్‌కు తగ్గ కథ కాదని.. ఇలాంటి సినిమాను ఎందుకు నటించాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా.. అంత చెత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నానా పటేకర్.. సిల్వర్ స్క్రీన్ మాస్మరైజర్ ప్రాజెక్ట్ రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్ట్‌ను అసలు వదులుకోవడం ఏంటి.. అంటూ విరాశ వ్యక్తం చేస్తున్నారు. పైగా.. ఇది మహేష్ బాబు సినిమాలో కీలకమైన తండ్రి రోల్ అని టాక్.